రిస్క్ తీసుకోవడం ఎంత రిస్కో మనకి తెలుసు. అయితే రిస్క్ తీసుకోవడం గురించి రతన్ టాటా ఏం చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా లైఫ్ లో రిస్క్ అని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకసారి రిస్క్ తీసుకుని దాని నుంచి బయటపడితే లైఫ్ లో అనుకోనంత ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటాము. రతన్ టాటా రిస్క్ గురించి ఏం చెప్పారనేది చూస్తే.. ఎవరు ఇనుముని నాశనం చేయలేరు. కానీ దాని సొంత తుప్పు చేస్తుంది. ఎవరు ఒక వ్యక్తిని నాశనం చేయలేరు కానీ వాళ్ళ సొంత ఆలోచన విధానం వాళ్ళని చేస్తుంది. మీరు వేగంగా నడవాలి అనుకుంటే ఒంటరిగా నడవండి కానీ చాలా దూరం నడవాలి అనుకుంటే మాత్రం కలిసి నడవండి అని టాటా చెప్పారు.
అలాగే టాటా నేను చాలా విజయవంతమైన వ్యక్తుల్ని ఆరాధిస్తానని.. ఆ విజయాన్ని నిర్దాక్షిణ్యంగా సాధించినట్లయితే నేను ఆ వ్యక్తిని తక్కువగా ఆరాధిస్తానని అన్నారు. అలాగే జీవితం కొనసాగించడానికి హెచ్చుతగులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈసీజీలో కూడా సరళరేఖ అంటే మనం సజీవంగా లేము అని రతన్ టాటా చెప్పారు. అంతేకాకుండా ఒక రోజు మీరు భౌతిక విషయాలు ఏమీ అర్థం చేసుకోలేరు. ముఖ్యమైనది మీరు ఇష్టపడే వ్యక్తులు శ్రేయస్సు అని అన్నారు.
ఉత్తమ నాయకులు కంటే తెలివిగా వారి సహాయకులు సహచరులు తయారు చేయడానికి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు అని కూడా చెప్పారు. అతి పెద్ద రిస్క్ ఏ రిస్క్ తీసుకోకపోవడం త్వరగా మారుతున్న ప్రపంచంలో విఫలమవ్వడానికి ఏకైక కారణం రిస్క్ తీసుకోకపోవడం అని రతన్ టాటా చెప్పారు. అలాగే వారు సవాళ్లను ఎదుర్కోవడంలో పట్టుదలగా దృఢంగా ఉండాలని ఎందుకంటే అవి విజయానికి బిల్డింగ్ బ్లాక్స్ అని ఆయన చెప్పారు. రతన్ టాటా చెప్పిన అద్భుతమైన విషయాలను కనుక మీరు మీ లైఫ్ లో ఆచరించినట్లయితే ఆయనలా సక్సెస్ అవుతారు.