రోజు మొత్తం ఎనర్జీ లెవెల్స్ ఒకేలా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

-

మహమ్మారి కారణంగా ఆఫీసులకి వెళ్ళడం బాగా తగ్గిపోయింది. పనంతా ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. ఈ సౌలభ్యం కొంతమందికి ఇబ్బందిగా ఉంటే, మరికొంత మందికి చాలా సౌకర్యంగా ఉంది. ఐతే ఏది ఎలా ఉన్నా పని మొదలెట్టినపుడు ఉన్న ఎనర్జీ, ఆసక్తి చివరికొచ్చేసరికి ఉండట్లేదన్నది చాలా మంది కంప్లైంట్. ఎంత ఉత్సాహంగా పనిచేయడం మొదలెడ్తున్నారో అంతే ఉత్సాహంగా పని కంప్లీట్ చేయలేకపోతున్నారు. అలా కాకుండా ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఒకేలా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

డాన్స్

మిమ్మల్ని ఎవరూ చూడనపుడు మీకు నచ్చినట్టుగా డాన్స్ చేయండి. దీనివల్ల రక్తం ఉప్పొంగుతుంది. ఆ కారణంగా మీలో కొత్త ఎనర్జీ వస్తుంది. డాన్స్ అనేది మీలో ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.

ఆనందించాలి

విషయం చిన్నదైనా పెద్దదైనా మీకు సంతోషాన్ని కలిగిస్తే తప్పకుండా ఆనందించండి. పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడే ఆనందిస్తా అని కూర్చుంటే మీ జీవితంలో అలా కలిగే ఆనందాలు కేవలం మూడో నాలుగో ఉండి ఉంటాయి. ఈ రోజు పొద్దున్న మీరు అనుకున్న సమయానికే నిద్రలేచారు, అది ఆనందమే. మీ పిల్లల్ని స్కూల్ వరకూ డ్రాప్ చేసి వచ్చారు. అదీ ఆనందమే. మీ భార్య అడగకుండానే, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తెచ్చారు. అదీ ఆనందమే.

మీకు నచ్చే సంగీతం వినండి

మీలో ఉత్సాహాన్ని నింపే సంగీతం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ప్రేరణ కలిగించే మ్యూజిక్ బాగుంటుంది. సాహిత్య పరంగా స్ఫూర్తినిచ్చే పాటలు వినండి. ఒకటి, రెండని కాకుండా మీకు నచ్చినన్ని సార్లు ఒకే పాటని వినండి.

నవ్వండి

నవ్వడం అనేదాన్ని కూడా చాలా పొదుపుగా వాడేవారుంటారు. నవ్వితే ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి అదుపులో పెట్టుకుంటారు. సరిగ్గా నవ్వడానికి కూడా ఆంక్షలు పెడితే జీవితం ఎందుకు. హాయిగా నవ్వండి.

నిద్ర

ఎంత బాగా పనిచేస్తారో అంత బాగా నిద్రపోండి. ఈ రోజు సరిగా నిద్రపోతేనే రేపు బాగా పనిచేస్తారు. సరైన నిద్ర రేపటి ఉత్సాహానికి పునాది.

Read more RELATED
Recommended to you

Exit mobile version