ఇప్పటి వరకూ మన దగ్గర ఉన్నవన్నీ మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్, క్రెడిట్ కార్డులే. అయితే.. వీటిని క్లోనింగ్ చేయడం… హాక్ చేయడం చాలా సులువు. అందుకే.. ఆ మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికే బ్యాంకులు చిప్ బేస్ డ్ కార్డులను తీసుకొస్తున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ కార్డులను తీసుకొస్తున్నాయి. జనవరి 1, 2019 నుంచి చిప్ ఆధారిత కార్డులు మాత్రమే పనిచేస్తాయి. వేరేవి పనిచేయవు. అందుకే.. జనవరి 1 లోపు చిప్ ఆధారిత కార్డులకు అందరూ మారిపోవాల్సిందే.
ఇంకా మీరు మార్చుకోలేదా? సమయం లేదు.. దగ్గర పడింది. ఇప్పటికైనా వెంటనే మీ బ్యాంకు బ్రాంచును సంప్రదించి వెంటనే కొత్త ఏటీఎం కార్డు కోసం అప్లయి చేసుకోండి. మీరు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే బ్యాంకు బ్రాంచుకు పోవాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీ అడ్రస్ కే కార్డును బ్యాంకు వాళ్లు పంపిస్తారు.