వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా..? బాస్ ని ఇంప్రెస్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్

-

కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. ఇంటి దగ్గరే ఉంటూ వర్క్ చేసుకునే అలవాటు అందరికీ ఒంటబట్టింది. అయితే ఇంటి దగ్గర నుంచి పని చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా గుర్తింపు లేకపోవడం.

సీనియర్లను, బాసులను కలిసే అవకాశం ఉండదు కాబట్టి మీరెంత పని చేస్తున్నారనేది వాళ్ళకు తెలియక.. మీకు గుర్తింపు రాకుండా ఉంటుంది. ఇలాంటి సిచువేషన్స్ ని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే.. బాస్ దృష్టిలో మీరు పడాలంటే కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి. అవేంటో తెలుసుకుందాం.

క్రమం తప్పకుండా కమ్యూనికేషన్:

రోజులో కనీసం ఒకసారయినా బాస్ లో ఫోన్ కాల్ మాట్లాడండి. మీరేం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో డిస్కస్ చేయండి. కొన్నిసార్లు మీకు అన్నీ తెలిసినా కూడా సందేహాలు అడగండి. ఇలా చేయడం వల్ల మీ పేరును బాస్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

కొత్త టాస్కులు స్వీకరించండి:

మీ టీమ్ మొత్తానికి ఒక టాస్క్ ఇవ్వాలని బాస్ అనుకుంటున్నప్పుడు.. ఆ టాస్కును స్వీకరించి బాస్ దృష్టిలో పడండి. వర్క్ ఎలాంటిదైనా సిద్ధంగా ఉంటాడనే నమ్మకం మీ మీద .. మీ బాస్ కి ఈ విధంగా వస్తుంది.

వీడియో ఆన్ చేయండి:

సాధారణంగా మీటింగ్స్ అన్నీ ఆడియో కాల్స్ లోనే జరుగుతాయి. అవసరం ఉన్నప్పుడు వీడియో కాల్ ఆన్ చేయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బాస్ కి అర్థమవుతుంది. కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం వల్ల మీ బాస్ కి మీ మీద నమ్మకం పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version