2021 Round up: 2021 లో మనోభావాల్ని దెబ్బతీసిన 7 యాడ్స్ ఇవే..!

-

2021 లో వచ్చిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లు భారతీయుల సెంటిమెంట్లని బాధ పెట్టాయి. నిజానికి ఈ అడ్వర్టైజ్మెంట్లు కాస్త కఠోరంగా వున్నాయి. అయితే మరి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి..? 2021లో వచ్చినా ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎలా మనల్ని బాధ పెట్టాయి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని కొన్ని సార్లు కొన్ని అడ్వర్టైజ్మెంట్ల కారణంగా కూడా మనకి ఇబ్బంది వస్తుంది. అలాంటివి 2021 లో కూడా వచ్చాయి.

Ceat:

ఈ టైర్ల అడ్వటైజ్మెంట్ మనల్ని బాధ పెట్టింది. ఇందులో అమీర్ ఖాన్ వచ్చి దీపావళి సామాన్లని కాల్చవద్దని చెప్తారు. నిజంగా ఇది మన భారతీయ ప్రజలని బాధపెట్టింది. ఈ అడ్వటైజ్మెంట్ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. 2021 లో వచ్చి బాధపెట్టిన అడ్వర్టైజ్మెంట్లలో ఇది ఒకటి.

రాపిడో:

అల్లు అర్జున్‌ చేసిన రాపిడో యాడ్ ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నోటీసులు పంపారు. ఆ యాడ్ లో ఆర్టీసీ నెమ్మదిగా తీసుకెళ్తుందని వుంది. రాపిడో అయితే చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని ఆ యాడ్ లో వుంది.

మాకో స్పోర్ట్ఓ:

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి రష్మిక మందన యాడ్ చేసింది. ఆమె చేసిన ఆ అండర్‌వేర్‌ యాడ్‌ కి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రష్మిక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండగా విక్కీ యోగా చేస్తుంటాడు. అప్పుడు షర్ట్‌ పైకి లేవడంతో అండర్ వేర్ బయటకి కనపడుతుంది. అది చూసి ఈమె ఇంప్రెస్ అవుతుంది. చీప్‌ యాడ్‌ అంటూ నెటిజన్లు ఈ యాడ్ మీద ట్రోల్స్ చేసారు.

ఫ్యాబ్ ఇండియా:

ఫ్యాబ్ ఇండియా కూడా బాధ పెట్టే అడ్వర్టైజ్మెంట్ ఒకటి తీసింది. ఫెస్టివ్ కలెక్షన్ కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అక్టోబర్ 9న తీశారు. సోషల్ మీడియా యూజర్లు దీనిని తొలగించమని చెప్పారు. హిందూ పండుగలను ఉద్దేశించి దీనిని తీశారు.

మాన్యవర్:

ఆలియా భట్ మాన్యవర్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చి కన్యాదానం అని ఎందుకు అనాలి అంటూ నెగటివ్ గా తీసుకొచ్చింది. ఈ యాడ్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. పురాతన కాలం నుండి వస్తున్న సంప్రదాయాలను ఈమె తప్పుగా ఉద్దేశించి చేశారని అలియా భట్ ని విపరీతంగా ట్రోల్ చేసారు.

డాబర్ :

డాబర్ కార్వాచౌత్ పండుగకు లెస్బియన్ల అంశాన్ని చేర్చి కమర్షియల్ యాడ్ చేసింది. ఈ చర్య వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇద్దరు అమ్మాయిలని భార్య భర్తలుగా ఈ యాడ్ లో చూపిస్తారు. స్వలింగ సంపర్కులకు సపోర్ట్ ఇస్తూ డాబర్ ఈ యాడ్ చేయడంతో హిందువుల సంప్రదాయాల్నీ, పండుగల్నీ పక్కదారి పట్టించేలా ఎందుకు యాడ్స్ చేస్తున్నారని ప్రశ్నించారు.

నైకా:

ఈ ఏడాది నైకా కూడా మనోభావాల్ని దెబ్బతీసేలా యాడ్ చేసింది. కండోమ్స్ మరియు లూబ్రికెంట్స్ కి నవరాత్రి అనే ట్యాగ్ ని సేల్ సమయం లో ఉపయోగించింది.

సభ్యసాచి మంగళసూత్రం యాడ్:

సభ్యసాచి యాడ్స్ ఎప్పుడు కూడా ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంటాయి. సభ్యసాచి మంగళ సూత్రం యాడ్ పై కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మంగళసూత్రం యాడ్ లాగ లేనే లేదు. కండోమ్స్, లోదుస్తులు యాడ్ లాగ వుంది అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

జొమాటో:

ఈ యాడ్ పై కూడా గట్టిగ ట్రోల్ల్స్ పడ్డాయి. హృతిక్‌రోషన్‌, కత్రినా కైఫ్‌ ఈ యాడ్ లో చేసారు. జొమాటో డెలివరీ కార్మికుల పట్ల ఇంత అన్యాయమా అంటూ నెటిజన్లు జొమాటోపై మండి పడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news