పదివేల గదులున్న హోటల్‌.. 80 ఏళ్లుగా ఒక్క బుకింగ్‌ కూడా లేదు..

-

కొత్త చోటుకు వెళ్లినప్పుడు.. మనం ముందుగా చేసుకునేది.. హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవడమే..! మన కంఫర్ట్‌కు, బడ్జెట్‌కు తగ్గట్టుగా బుక్‌ చేసుకుంటాం. టూరిస్ట్‌ ప్లేస్‌లో అయితే హోటల్స్‌ అసలే ఖాళీగానే ఉండవు. ముందుగానే బుక్‌ చేసుకోవాలి. అలాంటిది ఓ హోటల్‌లో 80 ఏళ్లుగా ఒక్క బుకింగ్‌ కూడా లేదట.. అలా అని అది ఏమైనా తుప్పాస్‌ హోటలా అంటే.. కానే కాదు.. పదివేల గదులున్న విలాసవంతమైన హోటల్‌.. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు టూరిస్ట్‌లు అక్కడికి వెళ్లడం లేదు..? దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి..?
జర్మనీలోని బాల్టిక్ సముద్ర తీరంలో రుగెన్ ద్వీపంలో ఉంది ఈ హోటల్. 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హోటల్‌లో ఇప్పటివరకూ ఎవ్వరూ అడుగుపెట్టలేదు. ఇందులో 10 వేల గదులున్నాయి. 1936-39 మధ్య కాలంలో ఈ హోటల్‌ను నిర్మించారు. అప్పటికి జర్మనీని హిట్లర్ పరిపాలిస్తున్నాడు. అప్పటి నాజీ ఆర్మీ ఈ హోటల్‌ను దగ్గరుండి మరీ కట్టించిందట. దాదాపు 9 వేల మంది కార్మికులు కలిసి ఇంత పెద్ద హోటల్‌ను నిర్మించారు. దీన్ని హోటల్ డ ప్రొర (Prora Hotel) అని పిలుస్తారు. ఈ పేరు పెట్టడం వెనక కూడా ఓ హిస్టరీ ఉంది. ఈ ఏరియాలో మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఎక్కడ చూసినా పొదలే కనిపిస్తాయి. Prora అంటే జర్మన్ భాషలో పొదలు అని అర్థం. అందుకే ఈ హోటల్‌కు Prora Hotel అని పేరు పెట్టారు.
సముద్ర తీరానికి 150 మీటర్ల దూరంలో ఈ హోటల్‌ను నిర్మించారు. మొత్తం ఈ హోటల్‌లో 8 బ్లాక్‌లు ఉంటాయి. 4.5 కిలోమీటర్ల పొడవున ఈ హోటల్‌ విస్తరించి ఉంది. ఇందులో సినిమా హాల్, ఫెస్టివల్ హాల్‌తో పాటు స్విమ్మింగ్ పూల్‌ కూడా ఉంది. అంతే కాదు. ఓ క్రూజ్ షిప్‌ పట్టేంత స్పేస్ ఉంటుంది. ఈ హోటల్ నిర్మాణం తుది దశకు వచ్చే నాటికి అంటే..1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలయ్యాక ఈ నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. కార్మికులందరూ హిట్లర్ వార్ ఫ్యాక్టరీల్లో పని చేయాల్సి వచ్చింది. 1945లో యుద్ధం ముగిసింది.. మళ్లీ ఎవరూ ఈ హోటల్‌ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా ఐసోలేటెడ్‌ అయిపోయింది. ఒకవేళ ఈ హోటల్‌ను తెరిచి బుకింగ్స్ ఓపెన్ అయితే…ప్రపంచంలోనే ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version