ఆ దేశంలో చిన్నారికి అరుదైన వ్యాధి.. రోగనిరోధకశక్తిపైనే దెబ్బ

-

కొవిడ్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని ప్రతీ దేశం వైద్యం పట్ల ఎంతో జాగ్రత్త వహించాలనే విషయం కొంతమేరకైన అర్థమై ఉంటుంది. కొవిడ్ వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ సదరు వైరస్ మరింతగా రూపాంతరం చెందుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. మానవ విజ్ఞానాన్ని, టెక్నాలజీని సవాల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో మరో నూతన అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. అది చిన్నారికి వస్తే చాలు ఇమ్యూనిటీ పవర్ కంప్లీట్ కొలాప్స్ అవుతుందట. ఇంతకీ ఏ దేశంలో ఆ డిసీజ్ వచ్చిందంటే..

కెనడా దేశంలోని ఓ 12 ఏళ్ల బాలుడి నాలుక ఇటీవల ఉన్నట్లుండి పూర్తిగా పసుపు రంగులోకి మారింది. దాంతో పాటు సదరు బాలుడి చర్మం రంగులోనూ మార్పు వచ్చింది. గొంతులో నొప్పి కూడా వచ్చింది. బాలుడి పేరెంట్స్ వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. మొదట్లో కొవిడ్ వైరస్ మరో నూతన రూపాంతరం అని భయపడినప్పటికీ అది కాదని వైద్యులు నిర్ధారించారు. కోల్డ్ అగ్లుటినిన్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు తెలిపారు.

ఈ డిసీజ్‌ బాధితుడి రోగనిరోధక శక్తిపై విరుచుకుపడుతుంది. శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్‌ను చంపేస్తుంది. ఫలితంగా బాడీ ప్లస్ నాలుక పసుపు రంగులోకి ఆటోమేటిక్‌గా మారుతుంది. అయితే, సదరు బాలుడికి ట్రీట్‌మెంట్ అందింది. ఈ వ్యాధి వస్తే ఏడు వారాల పాటు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఈ మేరకు చికిత్స అందించగా కెనడాకు చెందిన బాలుడు ప్రజెంట్ హెల్దీగానే ఉన్నట్లు ఆ దేశ వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న వైరస్, జబ్బులతో సతమతమవుతుండగా కొత్త వ్యాధులు వస్తే ఇక ప్రపంచం ఉంటుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version