మురికి కాళ్లతో మురిపిస్తూ కాసులు సంపాదిస్తున్న యువకుడు..!

-

ఎక్కడి నుంచి వచ్చినా కాళ్లు కడుక్కోని ఇంట్లోకి రావాలని అంటారు.. ఇలా చేయడం వల్ల కాళ్లపై ఉన్న దుమ్ము ధూళి క్లీన్ అవుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం కాళ్లు కడుక్కోకుండా పైసలు సంపాదిస్తున్నాడు. సోషల్‌ మీడియా వెర్రిలో భాగంగా.. మనోడికి డబ్బులు కూడా వస్తున్నాయి. మురికి కాళ్లకు మురిసిపోయి డబ్బులు చెల్లిస్తున్నారు ఫాలోవర్లు. ఇదంతా వింటుంటే ఏంట్రా అనిపిస్తుంది కదూ.. అసలేంటి కథ..? కాళ్లు కడుక్కోకుండా ఉండే కాన్సప్ట్‌ ఏంటో చూద్దామా..!

యూకేకు చెందిన 20 ఏళ్ల జార్జ్ వుడ్‌విల్లే.. ఏ పని చేయకుండా కోటీశ్వరుడు కావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇందుకు అతడికి వచ్చిన ఐడియా ఎలాంటి పాదరక్షణలు ధరించకుండా నడవడం, కాళ్లను మురికి చేసుకోవడం. అతడు తన ఐడియాను స్నేహితులతో పంచుకున్నప్పుడు చాలా క్రేజీగా అనిపించింది. కానీ, అతడు చేస్తున్న పని చూసి ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. జార్జ్ తన మురికి కాళ్ల ఫొటోలను OnlyFans వెబ్‌సైట్లో పెట్టుకుని విక్రయిస్తున్నాడు. అయినా, మురికి కాళ్లను ఎవరు కొంటారులే అనుకుంటారేమో.. చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు అతడి మురికి కాళ్ల ఫొటోలను కొనేందుకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఫాలోవర్లు ఎగబడుతున్నారట..!

జార్జ్.. కొంతమందిలో ఉండే విచిత్రమైన కోరికలను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని మొదలుపెట్టాడు. గత పది నెలలుగా అతడు షూస్ ధరించడం లేదు. మరణించే వరకు తాను పాదరక్షణలు వేసుకోనని, కాళ్లు కడగడనని ప్రతిజ్ఞ చేశాడు. గతేడాది అక్టోబర్ నెలలో తన కుటుంబంతో కలిసి ప్లైమౌత్‌కి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన జార్జ్.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడట.. అంతే అక్కడే చెప్పులు పడేసి వచ్చాడు.

ఆ రోజు నుంచి అతడు బార్‌లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్‌లు, నైట్‌క్లబ్‌లలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. ‘టిక్‌టాక్‌’లో కూడా జార్జ్‌కు అకౌంట్ ఉంది. అందులో చాలామంది అతడి మురికి కాళ్ల ఫొటోలు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో జార్జ్.. ఓన్లీ‌ఫ్యాన్స్ అకౌంట్ ద్వారా వారి కోరిక తీరుస్తున్నాడు.

ప్రస్తుతం అతడి ప్రయత్నానికి డబ్బులు బాగానే వస్తున్నాయి. అది విజయవంతంగా కొనసాగితే త్వరలోనే తాను కోటీశ్వరుడిని అయిపోతానని అంటున్నాడు. మనోడు కోటిశ్వరుడు అయ్యేసరికి ఆ పాదాలు ఉంటాయా..? ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురై పోతాయా చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version