20 ఏళ్లకే కోట్లు సంపాదిస్తున్న యువతి.. లక్‌ అంటే ఇదేనా..?

-

లైఫ్‌లో డబ్బు సంపాదించడం కొందరకి కష్టం.. మరికొందరు చాలా తేలిక.. రెండు వందల రూపాయల కోసం ఓ వ్యక్తి రోజంతా కూలి పని చేస్తున్నాడు.. మరో వ్యక్తి రోజుకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు.. అందరూ మనుషులే కానీ.. వారి తలరాతలే వేరు. 18 ఏళ్లకే ఓ యువతి కోట్లు సంపాదించింది.. ఆమె పేరు ఒలివియా దున్నె.. వృత్తిపరంగా జిమ్నాస్ట్. జిమ్నాస్ట్ చేస్తే అన్ని కోట్లు వస్తాయా..? అంత డబ్బు ఇంత చిన్న వయసులో ఎలా సంపాదించింది..

పేరు ఒలివియా దున్నె. వయసు 20 ఏళ్లు. వృత్తి జిమ్నాస్ట్. ప్రస్తుతం NCAAలో లూసియానా స్టేట్ యూనివర్శిటీ తరపున పోటీల్లో పాల్గొంటోంది. అయితే.. రెండేళ్ల కిందటే ఆమె రూ.8 కోట్లకు పైగా సంపాదనతో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. ఈ బ్లాండే బ్యూటీ ఇంతలా సంపాదించడానికి కారణం.. ఆమె జిమ్నాస్ట్ అవ్వగానే.. యాడ్ ఆఫర్లు క్యూ కట్టాయి. భారీగా డబ్బు వచ్చే స్పాన్సర్‌షిప్‌లు దక్కాయి. దాంతో రెండు చేతులా సంపాదిస్తోంది.

క్రీడాకారులు.. ఆటపైనే ఫోకస్ పెట్టాలనీ.. యాడ్స్ చెయ్యకూడదనీ ఇదివరకు రూల్స్ ఉండేవి. 2021 జూన్‌లో ఈ రూల్స్‌ని సడలించారు. దాంతో ఒలివియా బాగా కలిసి వచ్చింది. వచ్చిన ప్రమోషన్ యాడ్లను ఆమె చక్కగా ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ జిమ్నాస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 26 లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌ను సంపాదించుకుంది. వారి కోసం తరచూ ఫొటోషూట్స్ చేస్తుంది.

ఒలివియా పెట్టిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోయి.. తెగ కమెంట్స్‌ చేస్తారు. ఈ ఫొటోలకు 6.69 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. “నమ్మశక్యం కాని అందం” అని ఒకరు మెచ్చుకోగా… “నువ్వు చాలా హాట్” అని మరొకరు మెచ్చుకున్నారు. ఇంకా వేల మంది ఫైర్, హార్ట్ ఇమోజీలను కామెంట్స్ సెక్షన్‌లో పోస్ట్ చేశారు. ఒలివియాకి ప్రశంసలే కాదు.. కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. అందాన్ని క్యాష్ చేసుకుంటోందనీ.. ఆట కంటే ఆమెకు డబ్బే ముఖ్యమైపోయిందని విమర్శిస్తున్నారు. కామనే కదా.. ప్రతి విషయాన్ని రెండు విధాలుగా ఆలోచించేవాళ్లు ఉంటారు.. ఏది తీసుకువాలి అని మీ ఛాయిస్.

పైజ్ స్పిరానాక్ ఒకప్పుడు గోల్ఫ్ క్రీడాకారిణి. ఆటకు గుడ్ బై చెప్పిన ఆమె.. ఇప్పుడు తన అందంతోనే సంపాదిస్తుంది. వరుస యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది. ఒలివియా మాత్రం మనీ కంటే ఆటపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అదే సమయంలో ఆమెకు ఆఫర్లతో మనీ కూడా వస్తోంది. 2022 అక్టోబర్‌లో ఒలివియా.. అత్యంత ప్రభావిత మహిళా అథ్లెట్లలో టాప్‌లో నిలిచింది. ఆన్ 3 స్పోర్ట్స్ నిల్ వాల్యుయేషన్ లిస్ట్‌లో ఆమెకు మొదటి స్థానం ఇచ్చారు. ప్రస్తుతం ఒలివియాకి టిక్‌టాక్‌లో 66 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రేజ్ వల్లే ఆమె యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా భారీగా సంపాదించగలుగుతోంది. సోషల్‌ మీడియా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. అందులో ఒలివియా కూడా ఒకటి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version