అక్కడ చుక్క మందు తాగినా పిల్లను ఇవ్వరు… ఎవరైనా సరే…!

-

మద్యపాన నిషేధం అమలులో… గుజరాత్ ముందు ఉంటుంది… స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ళ నుంచే దీనిని అమలు చేస్తున్నాయి గుజరాత్ ప్రభుత్వాలు. కారణం మద్యపాన నిషేధం విషయంలో గాంధిజీ కఠినంగా వ్యవహరించే వారు కాబట్టి గుజరాత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన సొంత రాష్ట్రంలోనే అమలు జరగకపోతే ఎలా…? అందుకే విజయవంతంగా అక్కడ అమలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే మద్యం విషయంలో ప్రభుత్వాలు ముందు నుంచి కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.

అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. అక్కడ మద్యం దొరకకపోవడంతో… ఇతర రాష్ట్రాలకు వెళ్లి మద్యం తెచ్చుకుని తాగుతున్నారు కొందరు యువత. 12 ఏళ్ళ వయసు నుంచే… మద్యానికి బానిసలు అవుతున్నారు. మద్యానికి చిన్న వయసులోనే బానిసలు కావడం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేని వాళ్ళు… నాటు సారాకు అలవాటు పడుతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం పాలు అవుతున్నారు. దీనితో కొన్ని గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ పిల్లను ఇవ్వాలి అంటే పలానా షరతులు పాటించాల్సిందే అని స్పష్టం చేస్తున్నాయి.

గుజరాత్ లోని గాంధీ నగర్ కు 15 మైళ్ళ దూరంలో ఉండే ఒక పల్లెలో… ఇటీవల ఒక అమ్మాయికి వివాహం చేసారు. ఈ సందర్భంగా పెళ్లి పీటల మీద కూర్చునే ముందు… అబ్బాయి తరుపు సన్నిహిత బంధువులు అందరికి మద్యం టెస్ట్ చేసారు. వాసన వస్తుందా అని చూసారు. వాళ్ళ మెడికల్ టెస్ట్ రిపోర్ట్ లు కూడా అడిగారు… మద్యం తాగారని తెలియడం వాళ్లకు మద్యం అలవాటు ఉందని తెలియడంతో… వివాహాన్ని రద్దు చేసారు. అబ్బాయికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే మద్యపానం అలవాటు ఉండే సరికి… పిల్లను ఇవ్వడానికి ఎంత మాత్రం ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రంలో చాలా గ్రామాలు ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాయి. మద్యపానం లేకపోతేనే జీవితంలోనే జీవితం లో రాణిస్తారు, సంతోషంగా ఉంటారు అని నమ్ముతూ… ఈ కఠిన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version