రెండు రోజులు పర్యటన కోసం దేశానికి వచ్చిన అగ్రారాజ్యాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు భారత ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ విందులో ఉపముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు సీఎం కేసీఆర్ సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా విందులో అంతమంది ఉంటే రెహమాన్ మాత్రం ఒకరిపైనే దృష్టి సారించాడు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందరూ విందుకు కూర్చున్న వేళ, ఓ మర్కటం అక్కడికి వచ్చి, పూల కుండీ పక్కన కూర్చుని విందు ఆరగించింది. సదరు కోతి ఆకులను తింటుంటే, వీడియో తీసిన రెహమాన్, “ఓ చిట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చాడు” అని కామెంట్ చేస్తూ, దాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.