అసలు ఈ చైనా వల్ల మనకు ఎప్పుడూ ఏదో ఒక లొల్లి ఉంటది కదా..! కరోనాను తీసుకొచ్చి.. మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశారు. దాని వల్ల ఇప్పటికీ ఎంతో మంది జాబ్స్ కోల్పోయి బాధపడుతున్నారు. కరోనా దెబ్బ నుంచి ఇంకా చాలా కంపెనీలు కోలుకోలేదు. ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేస్తారో అనే భయంతో చస్తూ బతుకుతున్న ఉద్యోగులు ఎంతోమంది. ఇదిలా ఉంటే.. మళ్లీ చైనా మరో కొత్త ప్రాణాంతకమైన వ్యాధితో ముందుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలని, ప్రాణాంతకమని హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..
చైనాలో బుబోనిక్ ప్లేగ్ వ్యాధి ప్రబలుతోంది. ఇది కొత్త వ్యాధేమీ కాదు. పాతదే. కాకపోతే.. కొత్తగా వ్యాపిస్తోంది. చైనా అధీనంలోని ఇన్నర్ మంగోలియాలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది. చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియా ఉంది. శనివారం 2 బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు కన్ఫామ్ అయ్యాయి. ఈ వ్యాధి ఆగస్టు 7న మొదలైనట్లు అక్కడి రిపోర్టులు చెబుతున్నాయి. ఓ తండ్రి, కూతురికి ఈ వ్యాధి సోకింది. వారికి టెస్టులు చేసి.. శనివారం నిర్ధారించారు. దాంతో.. వ్యాధి సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారందర్నీ పిలిపించి టెస్టులు చేశారు. ఎవరిలోనూ అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.
బుబోనిక్ ప్లేగ్ అనేది.. చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇది ఎలుకలు, చుంచెలుకలు, పందికొక్కులు వ్యర్థాల నుంచి ఇది వ్యాపిస్తుంది. అవి తినగా వదిలేసిన ఆహారం నుంచి కూడా వ్యాపిస్తుంది. దీన్ని బ్లాక్ డెత్ వ్యాధి అని కూడా అంటారు. ఎందుకంటే.. ఆఫ్రికా ఖండంలో చాలా మంది నల్ల జాతీయులు ఈ వ్యాధి బారిన పడి చనిపోతుంటారట. ఇలాంటి కేసులు చైనాలో తక్కువే కానీ ఈమధ్య కొన్నేళ్లుగా ఇన్నర్ మంగోలియా, వాయవ్య నింజియా ప్రాంతంలో ఇలాంటి కేసులు తరచూ వస్తున్నాయి.
ప్లేగు వ్యాధుల్లో చాలా రకాల్లో ఒకటి ఈ బుబోనిక్ ప్లేగు. ఇది సోకిన వారికి తగిన సమయంలో చికిత్స ఇవ్వకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO తెలిపింది. బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకిన వారి శరీరంలోకి ప్లేగ్ బ్యాసిల్లస్, వై.పెస్టిస్ అనే సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత వీటి సంఖ్యను పెంచుకుంటాయి. మనుషుల నుంచి మనుషులకు ఈ ప్లేగు వ్యాధి సోకే అవకాశాలు తక్కువ. ఈ బుబోనిక్ ప్లేగులో కూడా.. నిమోనిక్ ప్లేగ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఊపిరి తిత్తులకు వ్యాపిస్తే మరణం తప్పదు.