చాలామంది రక్తదానం చేస్తూ ఉంటారు. రక్తదానం చేస్తే అవసరం ఉన్న వాళ్ళకి రక్తమందుతుంది ప్రాణాలను కాపాడొచ్చు. అయితే చాలామంది ఎక్కువగా రక్తదానాన్ని చేస్తూ ఉంటారు. అయితే పచ్చబొట్టు వేయించుకుంటే రక్తదానం చేయొచ్చా చేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రక్తదానం టాటూ వేయించుకున్న వాళ్ళు చేయవచ్చా లేదా అనే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పకు వచ్చింది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం.
పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా లేదా అనేది చూస్తే పచ్చబొట్టు వేయించుకున్న వాళ్లయితే 6 నెలల పాటు రక్తదానాన్ని చేయకపోవడమే మంచిది సూదులు పునర్వినియోగంలో ప్రధాన ఆందోళన ఉంటుంది. రక్తం ద్వారా సక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది పచ్చబొట్టు ప్రక్రియలో కొన్ని వాడతారు. వాటి వలన హెచ్ఐవి హెపటైటర్స్ బి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చ బొట్టు వేయించుకున్న వాళ్ళు వెంటనే రక్తదానం చేయకపోవడమే మంచిది.
చాలామందికి ఇలాంటి విషయాలు తెలియదు. దీంతో వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడూ కూడా టాటూ వేయించుకునేటప్పుడు పరిశుభ్రత కలిగిన చోట మాత్రమే వేయించుకోవాలి. ఆ తర్వాత రక్తపరీక్ష చేయించుకున్నాక రక్తదానం చేయొచ్చు. కనీసం ఆరు నెలలు సమయం తీసుకుంటే మంచిది. అలానే చాలా మంది చెవి, ముక్కు కుట్లు వంటివి చేయించుకుంటారు అలాంటప్పుడు కూడా రక్తదానం చేయడం కొంతకాలం ఆపాలి ఒక వారం పాటు ఆగి తర్వాత చేయొచ్చు. అంటువ్యాధులు వాపు వంటివి వస్తే తగ్గుతాయి. కాబట్టి రక్తదాత ఈ విషయాలని గుర్తుపెట్టుకోవడం మంచిది.