ఈ ఏనుగుల అల్ల‌రి చూస్తే న‌వ్వుకోకుండా ఉండ‌లేరేమో

సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా మూగ జంతువుల‌కు సంబంధించిన వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మామూలుగానే ప్ర‌పంచంలో ఎక్కువ‌గా ఇలాంటి జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఉంటారు. నలమూలల ఏం జరిగినా ఫేస్ బుక్ లేదా ట్విట్ట‌ర్ లో విప‌రీతంగా క్షణాల్లో వైరల్‌గా మార‌టం కామ‌న్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు మ‌నం చూసిన‌ప్పుడు ఎంతో జాయ్ ఫుల్ గా అనిపిస్తుంది.

ఇక చాలామంది టైమ్ పాస్ కోస‌మైనా స‌రే ఈ త‌ర‌హా జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే భారీ ఆకారం ఉండే ఏనుగుల‌కు, వాటి పిల్ల‌ల‌కు సంబంధించిన వీడియోలు ఈ మ‌ధ్య ఫేస్ బుక్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఇంత పెద్ద ఆకారం ఉండే ఏనుగులు, వాటి పిల్ల‌లు చిన్న పిల్ల‌ల్లాగే అల్ల‌రి చేస్తూ ఆడుకుంటూ ఉంటే ఇంక ఆ ఫీల్ వేరే లెవ‌ల్ క‌దా.


ఇక ఏనుగులు అవకాశం దొరికినప్పుడల్లా ఏ కొల‌నులోనో లేదంటే బుర‌ద‌లోనే లేదంటే మైదానంలోనో ఆడుకోవ‌డానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోల్లో ఏనుగులు చూడ‌టానికి చాలా సరదాగా కనిపిస్తుంది. ఇప్పుడు మ‌నం చెప‌పుకోబోయే వీడియోలో కూడా ఏనుగు కుటుంబం ఒక వాలులో దిగుతూ చిన్నపిల్లలా అల్లర్లు చేయడం మ‌నం చూడొచ్చు. ఈ బుర‌ద‌లో అవి ఎంతో స‌ర‌దాగా జార‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నించొచ్చు. మొదటగా ఒక ఏనుగు కిందికి జారి వస్తుంటే దాని వెన‌కాలే మ‌రో పెద్ద ఏనుగు కూడా జారుతూ ఎంజాయ్ చేస్తుంటాయి.