రీల్స్, షార్ట్స్ వంటి వాటికి అడిక్ట్ అవుతున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే..!

-

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు నుండి పెద్దల వరకు మొబైల్ ఫోన్‌ కు అడిక్ట్ అవుతున్నారు అనే చెప్పవచ్చు. వాటిలో షార్ట్స్, రీల్స్ వంటి వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. దీని వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరింత ఎక్కువగా షార్ట్స్ వంటి వాటిని చూడడం వలన వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే తల్లిదండ్రులు మొబైల్ ఫోన్‌ ను పిల్లలకు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.

పిల్లలు ఫోన్ పట్టుకుని ఎన్నో గంటలు సమయాన్ని గడుపుతున్నారు. దాని వలన ఇతర యాక్టివిటీలను అస్సలు చేయడం లేదు. మొబైల్ ఫోన్ వినియోగానికి బదులుగా పాటలు, ఆటలు, ఫిజికల్ యాక్టివిటీ వంటివి చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ముందు ఎక్కువ సమయాన్ని గడపడం వలన మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ పెరగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నా సరే, ఇటువంటి రీల్స్, షార్ట్స్ వలన ఆరోగ్యం మరియు మెదడు పై చాలా ప్రభావం పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. కనుక వీటికి దూరంగా ఉండే విధంగా చూడాలి.

స్క్రీన్‌కు బదులుగా కొంత సమయాన్ని ఇతరులతో మాట్లాడడం లేదా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని సరదాగా గడపడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన ఎక్కువ సమయాన్ని స్క్రీన్ ముందు గడపరు. ఎప్పుడైతే రీల్స్ మరియు షార్ట్స్ వంటి వాటికి బానిసలుగా మారతారో, ఎటువంటి పనులు చేయడానికి ఆసక్తి ఉండదు పైగా తిండి కూడా తినరు. కనుక చిన్నపిల్లలకు ఫోన్‌కు బదులుగా ఇతర యాక్టివిటీలు చేయిస్తూ ఉండాలి. దాంతో ఫోన్ పై దృష్టి తగ్గుతుంది మరియు మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా ఇతర యాక్టివిటీలు ఎంతో చురుకుగా చేస్తూ ఉంటారు మరియు చదువు పై కూడా శ్రద్ధ పెడతారు.

Read more RELATED
Recommended to you

Latest news