చైనాలో పిల్లలు ఫోన్ పట్టుకోకుండా… ఏకంగా చట్టాన్నే తెచ్చిన ప్రభుత్వం… ఎప్పుడెప్పుడు వాడాల౦టే…!

-

చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్ కి ఏ విధం గా అలవాటు పడిపోయారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చదువు మీద దృష్టి పోతుందని తల్లి తండ్రులు ఎన్నో సందర్భాల్లో స్మార్ట్ ఫోన్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు… తమ బిడ్డల భవిష్యత్తుని స్మార్ట్ ఫోన్ నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంతో మంది పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేక… స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా ఎలా చెప్పినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ లో ఆటలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా దీనిని కట్టడి చేసేందుకు గానూ చైనా ప్రభుత్వం ముందుకి వచ్చింది. మైనర్ పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడే సమయంపై ‘కర్ఫ్యూ’ విధించామని చైనా ప్రకటించింది. అంటే దీని ప్రకారం… రోజురోజుకూ తీవ్రం అవుతున్న వీడియో గేమ్ వ్యసనాన్ని నియంత్రించేందుకు గానూ… చైనాలో 18 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆన్‌లైన్ గేమ్స్ ఆడడంపై నిషేధం నిషేధం ఉంటుంది. పిల్లలు వీక్‌ డేస్‌లో రోజుకు 90 నిమిషాలు, వారాంతాలు, సెలవుల్లో రోజుకు మూడు గంటలు వీడియో గేమ్స్ ఆడుకోడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

మంగళవారం ప్రభుత్వం తరఫున జారీ చేసిన అధికారిక మార్గనిర్దేశకాల్లో ఆన్‌లైన్ గేమ్స్ కోసం మైనర్లు ఖర్చు చేస్తున్న సొమ్ముపై కూడా పరిమితులు విధించారు. 8 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ కోసం నెలకు 200 యువాన్ల(2000 రూపాయలు) వరకూ ఖర్చు చేయచ్చు. 16 నుంచి 18 ఏళ్ల పిల్లల గేమింగ్ ఖాతాలపై నెలకు 400 యువాన్ల(4000 రూపాయలు ) వరకూ ఖర్చు చేయవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. గతంలో కూడా దీనిపై నిషేధం విధించినా మార్పు రాకపోవడంతో ఇప్పుడు చైనా మరో అడుగు ముందుకి వేసి కీలక నిర్ణయం తీసుకుని కఠినం గా అమలు చేస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news