మ‌హిళ‌ను అత్యాచారం నుంచి ర‌క్షించిన క‌రోనా వైర‌స్‌.. ఎలాగో తెలుసా..?

-

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది మంది హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ పేరు చెప్పి ఓ మ‌హిళ ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రించి అతి పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. వివారాల్లోకి వెళితే.. చైనాలోని ఓ మహిళ ఇటీవలే వుహాన్ పట్టణం నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివాసం ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ దొంగ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు.

ఒంటరిగా ఉన్నది గమనించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ.. తాము వుహాన్ నుంచి వచ్చామని.. తనకు కరోనా సొకిందంటూ అర‌వ‌డంతో దొంగ షాక్ తిన్నాడు. ఆ దొంగోడు నమ్మేలా పలుమార్లు దగ్గుతున్నట్లు యాక్టింగ్ చేయడంతో.. ఆ దొంగ నిజమనే నమ్మేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోతూ ఇంట్లో ఉన్న 3800 యువాన్లను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగోడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఏదేమైనా ప్రాణాంతకమైన క‌రోనా వైర‌స్ ఓ మ‌హిళ‌ను ఈ విధంగా ర‌క్షించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version