ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ పద్ధతుల్ని ప్రయత్నం చేయండి…!

-

సాధారణంగా చాలా మంది పిల్లలైనా, పెద్దలైనా ఏకాగ్రత పెట్టలేరు. ఏకాగ్రత పెట్టకపోతే ఏం చేద్దాం అన్నా కుదరదు. ఏకాగ్రత లేకపోతే అనుకున్న విజయాలు సాధించడం కూడా జరగదు. ఏకాగ్రతని పెట్టడానికి కొన్ని టిప్స్ ని అనుసరిస్తే సులువుగా మీరు దేనిలోనైనా ఏకాగ్రతను పెట్టడానికి వీలవుతుంది. అయితే మీరు మీ ఏకాగ్రతను పెంచుకోవాలని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండా ఈ టిప్స్ ని ఇప్పుడే చూసేయండి.

ఏకాగ్రతను పెంచుకొనేందుకు మార్గాలు:

మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయడం:

కొంచెం మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తే ఏకాగ్రతని పెంచుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న పద్ధతులే పెద్ద వాటికి దారి తీస్తాయి. అదేంటి ఇంత చిన్న పనులు వల్ల బ్రెయిన్ ఏకాగ్రత పెంచుకోవడం ఏంటి అనుకుంటున్నారా…? ఒకసారి ఈ ట్రైనింగ్ యాక్టివిటీస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సుడోకో, క్రాస్ వర్డ్ పజిల్స్, మెమరీ గేమ్స్, పదాలను కనిపెట్టడం, జిగ్సా పజిల్, చెస్ వంటి వాటిని చేస్తే తప్పకుండా మీ ఏకాగ్రతని పెంచుకోవచ్చు. వీటి వల్ల మీ షార్ట్ టర్మ్ మెమరీ కూడా పెరుగుతుంది. అదే పిల్లలకైతే పజిల్స్, చిన్న చిన్న మెమరీ గేమ్స్, కలరింగ్ వేయడం వంటి వాటితో కూడా ఏకాగ్రతని పెంచుకోవచ్చు.

నిద్రలేమి సమస్య:

నిద్ర వల్ల కూడా చాలా ముడిపడి ఉంటుంది. నిద్రలేమి సమస్య ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా సులువుగా పనులు చేసుకోవడం చేయండి. నిద్రని మీరు ఇంప్రూవ్ చేయాలంటే ఎం చెయ్యాలి అనే విషయానికి వస్తే…

పడుకునే గంట ముందే టీవీని ఆపేయండి, సెల్ ఫోన్ ని కూడా బంద్ చేసేయండి.
మంచి టెంపరేచర్ లో మీ రూమ్ ని ఉంచుకుని కంఫర్ట్ గా నిద్రపోండి.
నిద్రపోయే ముందు ప్రశాంతమైన పాటలు వినడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా మీకు నచ్చిన పుస్తకం చదవడం చేయండి.
ప్రతి రోజు ఒకే సమయానికి నిద్ర పోయేలా చూసుకోండి. ఇలా నిద్రలేమి సమస్య నుండి బయటపడి ఏకాగ్రతని పెంచుకోండి.

ప్రకృతి మధ్య గడపడం:

మీరు ఎప్పుడైనా గార్డెనింగ్ లాంటివి చేస్తే ప్రశాంతంగా ఉంటుంది మీరు గమనించారో లేదో.. కాబట్టి మీరు రోజు లో కొంత సమయాన్ని ఒక పార్క్ లేదా గార్డెన్ లో గడిపితే మీ ఏకాగ్రతను పెంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version