నరహ౦తకుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మానవత్వ పాళ్ళు ఏ మాత్రం కనపడని వాళ్ళు… భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి కథ వింటే వామ్మో ఇతనేం మనిషి అంటారు. అతని పేరు అన్వర్ కాంగో… ఇండోనేషియాలో ఉన్న మేడాన్ పట్టణంలో ఒక చమురు క్షేత్రంలో పని చేసే కుటుంబానికి అతను పుట్టాడు. 12 ఏట వరకు బాగా చదివిన అతను అక్కడి నుంచి కిరాయికి హత్యలు చేసే గ్యాంగులతో స్నేహం ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి రాకుండా వారి హత్యలను చూస్తూ పెరిగాడు.
ఇండోనేషియాలో 1965లో తిరుగుబాటు విఫలమయిన తర్వాత ఊచకోత మొదలుపెట్టారు. అప్పటి వరకు కిరాయి హత్యలు చూడటం వరకే చేసిన అన్వర్ అక్కడి నుంచి రూటు మార్చాడు. తన స్నేహితులతో కలిసి ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యం ఇండోనేషియాలో ఊచకోత కోయడం మొదలుపెట్టింది. ఇందుకోసం నేరగాళ్ళను కూడా వినియోగించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారిని చంపడం మొదలుపెట్టారు. వందల సంఖ్యలో అనుమానిత కమ్యూనిస్టులను వాళ్లు బంధించి హింసించి చంపడం మొదలుపెట్టారు.
ఇక అన్వర్ గ్యాంగ్ ని కూడా సైన్యం వాడుకుంది… ఇందులో అన్వర్ శైలి పూర్తిగా భిన్నంగా ఉండేది. గొంతుకు వైరు బిగించి, ఊపిరాడకుండా చేసి చంపడం అన్వర్ అమితంగా ఇష్టపడే వాడు. నిజం చెప్పమని బెదిరిస్తూ మెడకు వైరు చుట్టి చంపేయడం అతనికి చాలా ఇష్టం. రక్తం అంటే భయం కూడా మళ్ళీ… అందుకే అతను రక్తం రాకుండా ప్రాణాలు తీసేవాడు. అతనిని చూసిన సైనికులు కూడా ఒకానొక దశలో వణికిపోయారు. ఇక ప్రజల్లో అయితే అతని పేరు ఎత్తడానికి భయపడే పరిస్థితి ఉండేది. అతని కిరాతకం మీద ఒక డాక్యుమెంటరిని కూడా విడుదల చేసారు.