ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న.. పంచాయతీరాజ్, అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు ఇవాళ జీతాలు అందబోతున్నాయి. ఈ ఉద్యోగుల ఖాతాలలో ఇవాళ డబ్బులు జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ రెండు శాఖలకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు విడుదల చేసి ఒక రోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో… మంగళవారం రోజున అంటే ఇవాళ వారి ఖాతాలలో డబ్బులు జమకాబోతున్నాయి. ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… పంచాయతీ శాఖ ఉద్యోగులకు ఒకటో నెల జీతాలు పడుతున్నాయని వెల్లడించారు కూటమి నేతలు. అయితే ఈ నెల మాత్రం ఒక రోజు ముందుగానే జీతాలు పడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో… ఈ నెలలో ఒకరోజు ముందుగానే అందరికీ సామాజిక పెన్షన్లు కూడా అందించింది చంద్రబాబు నాయుడు సర్కార్.