Chandrababu Naidu Richest Chief Minister In India: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డు సృష్టించాడు. దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. ADR వెల్లడించిన రిపోర్టు ప్రకారం.. చంద్రబాబు ఆస్తుల విలువ అక్షరాల రూ.931 కోట్లుగా నమోదు అయ్యాయి.
దీంతో.. దేశంలోని 31 సీఎంలలో అత్యధికంగా ఆస్తులు కలిగిన సీఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. రూ.332 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో ఉండగా.. రూ.51 కోట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేవలం రూ.15 లక్షలతో.. అత్యంత పేద ముఖ్యమంత్రిగా నిలిచారు మమతా బెనర్జీ. ఇక దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచిన నేపథ్యంలోనే.. వైసీపీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. 2 ఎకరాల భూమితో ఇన్ని కోట్లు ఎలా సంపాదించినట్లు అట్లు వైసీపీ పోస్టులు పెడుతోంది.