తిరుమల భక్తులకు కొత్త సంవత్సరం ఆఫర్..!ఇవాళ దర్శనాలు త్వరగానే అవుతున్నాయి. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఈ తరుణంలోనే… 68, 298 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 16, 544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఇక నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 4.1 కోట్లుగా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా…టీటీడీ దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో (రూ.500) పాటు, రెండు స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ. 300) లేఖలకు అంగీకారం తెలిపారు చంద్రబాబు. దీంతో ప్రతి లేఖలో ఆరుగురు భక్తుల వరకు దర్శనాలకు సిఫారసు చేయవచ్చు.