ఆ పబ్ లో అలంకరణ కరెన్సీ నోట్లే.. కొట్టేస్తే ఇలా కనిపెట్టేయొచ్చు..!

-

సాధారణంగా..రెస్టారెంట్స్ కానీ పబ్స్ కానీ..రోటీన్ కి భిన్నంగా ఉంటే.. వాటికి పాపులారిటి ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని రెస్టారెంట్స్ లి ఫారెస్ట్ టైప్, యక్వేరియం టైప్ లో అలంకరిస్తుంటారు. ఈ మధ్య విజయవాడలో ఓ విమానంలో రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. ఇలా డెకరేట్ చేస్తే..పబ్లిసిటీ బాగా వస్తుంది. కానీ ఓ పబ్ మాత్రం ఏకంగా డబ్బుతోనే అలంకరించింది. ఏ చిల్లర నోట్స్ కాదు..ఏకంగా కోట్లలోనే ఉంటుందట. పబ్ లో అలంకరించిన ఆ డబ్బుకు యాజమాన్యం ఆదాయపుపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. ఈ పబ్ ఎక్కడుంది.. ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్‌ గైర్‌ దంపతులు 1977లో McGears Irish Pubను స్టాట్ చేశారు.. గైర్‌ సతీమణి మొల్లీ బేరర్‌గా కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. ఆమె సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్‌ నోట్‌ టిప్‌ ఇవ్వగా దానిపై తేదీ రాసి బార్‌లో టేబుల్‌కు అతికించింది. ఆ డాలర్‌ పబ్‌కు అదృష్టాన్ని తెస్తుందని ఆమె నమ్మింది. అలా ఆమెకు టిప్‌ రూపంలో వచ్చే ప్రతి నోటును బార్‌లోనే అతికించడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన కస్టమర్లు నోటుపై వారి పేరు రాసి ఇవ్వడం ప్రారంభించారు.

అలా కాలక్రమంలో పబ్‌ మొత్తం నోట్లమయమైపోయింది. దీంతో యాజమాన్యం టేబుల్స్‌కు, గోడలకు అతికించిన నోట్లను తీసి సీలింగ్‌కు వేలాడదీశారు.. ప్రస్తుతం ఈ పబ్‌లో అలంకరించిన నోట్ల విలువ అక్షరాల 2మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటేరూ. 14.61కోట్లు. ఎప్పటికప్పుడు పబ్ లో నోట్ల సంఖ్య పెరుగుతుండటంతో యాజమాన్యం ఏటా వీటిని లెక్కగట్టి ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తోంది.

ఎవరైనా ఆ డబ్బును ఎత్తుకుపోతే?

ఇంత డబ్బును పబ్లిక్ కా పెడితే ఎవరైనా లేపేస్తారనేగా మీ డౌట్.. అందుకే ఎవరికీ అందకుండా నోట్లను సీలింగ్‌కు వేలాడదీశారు. అయినా కొన్నిసార్లు దొంగతనం జరిగి కొంత డబ్బు పోయిందని యజమానులు చెబుతున్నారు. అయితే, ఇక్కడి వేలాడదీసిన నోట్లపై కస్టమర్లు నలుపు రంగు పెన్నుతో చేసిన సంతకాలు ఉంటాయి. ఈ పబ్‌, నోట్లపై సంతకాలు చేసే సంప్రదాయం ఉందని.. ఆ ప్రాంతంలో అందరికి తెలిసి ఉండటంతో కొట్టేసిన నోటు ఏ దుకాణంలో ఇచ్చినా వెంటనే పబ్‌ యాజమాన్యానికి విషయం తెలిసిపోతుంది. దొంగ దొరికిపోతాడు. అందుకే ఏ చింతా లేకుండా నోట్లను వేలాడదీసే సంప్రదాయాన్ని పబ్‌ కొనసాగిస్తోంది.

ఇదొక్కటే కాదు.. ఫ్లోరిడాలోనే డెస్టిన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో పబ్‌లో కూడా నోట్లను అతికించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version