దీప్ వీర్ పెళ్లి ఫోటోలను చూశారా?

-

దీప్ వీర్.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఇటలీలోని లేక్ కోమోలో వీళ్ల పెళ్లి అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అటు కొంకణి.. ఇటు సింధీ సంప్రదాయాల్లో వాళ్ల పెళ్లి జరిగింది. మొత్తానికి ఇటలీలో రెండు రోజులు రెండు సంప్రదాయాల్లో పెళ్లి జరుపుకున్నది దీప్ వీర్ జంట. ఇక.. సినీ అభిమానులు కూడా ఈ జంట పెళ్లి ఫోటోల కోసం తెగ వెయిట్ చేశారు. ఎంతలా అంటే వాళ్ల ఫోటోల మీద కూడా సోషల్ మీడియాలో జోక్స్ వచ్చాయి. తర్వాత దీపిక తన పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలను మాత్రం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. కానీ.. సినీ అభిమానులు రెండు ఫోటోలతో సంతృప్తి చెందలేదు. పెళ్లికి సంబంధించిన మరిన్ని ఫోటోలు కావాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండటంతో దీపిక మిగితా ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అవే ఈ ఫోటోలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version