ఈ వస్తువులను అస్సలు గిఫ్టుగా ఇవ్వద్దు.. తీసుకోవద్దు!

-

ఏదైన ఫంక్షన్లకి వెళ్తే మనం మనతోపాటు వారికి గిఫ్ట్‌ ఇవ్వడానికి ఏదో ఒక వస్తువు తీసుకెళ్తాం. దాన్ని చాలా గొప్పగా భాలిస్తాం కూడా. కానీ, కొన్ని వస్తువులను గిఫ్ట్‌ల రూపంలో ఇవ్వకూడదని పండితులు చెబుతారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గిఫ్ట్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా మనకు గిఫ్ట్‌ రూపంలో ఇస్తే అదేంటో చూడకముందే ఉబ్బితబ్బిపోతాం. కానీ, అలాంటి బహుమతుల్లో కొన్ని మన జీవితాలపై ప్రతికూలతలను కూడా చూపెడతాయి. దీనివల్ల నెగెటివ్‌ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి వస్తువులను ఇవ్వనూ కూడదు. తీసుకోవద్దు కూడా. దానికి వ్యతిరేకంగా చేస్తే నష్టాలు తప్పవని జోతిషులు చెబుతున్నారు.
కొన్ని వస్తువల వల్లైతే ఆర్థిక నష్టంతో పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోతామని అంటున్నారు.

  • ఆక్వేరియం గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇది అస్సలు ఇవ్వకూడదని జోతిషులు చెబుతారు. నీటితో ఉన్న ఏ వస్తువునూ బహుమతి రూపంలో ఇతరులకు ఇవ్వకూడదు. చేపల ఆక్సిజన్‌ మెషిన్, బౌల్స్‌ కూడా ఇవ్వకూడదు.
  • కొంతమందైతే వారి గుర్తుగా కత్తులు ఇస్తారు. ఈ గిఫ్ట్‌ తీసుకుంటే ఇక అంతే ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పోగవుతుంది. అనారోగ్యాలు, అష్టకష్టాల బారిన పడతారు.
  • కొంతమంది గిఫ్ట్‌ ఇవ్వబోయే వ్యక్తి వృత్తిని బట్టి అతనికి ఉపయోగపడేది ఇస్తారు. తీసుకున్నవారికి బాగానే ఉంటుంది. కానీ, ఇచ్చినవారికి వారికుండే ప్రతిభ పోతుంది.
    వారంతట వారే నిర్ణయం తీసుకొని అదే కరెక్టని అనుకుంటారు. దానివల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరు. ఆ తర్వాత దేనివల్ల వారికి ఈ నష్టం కలిగిందనే దానిపై వారికి ఆలోచన కూడా రాదు.
  • టవల్, హ్యాండ్‌ కర్చీఫ్‌లు గిఫ్ట్‌గా కాదు, మాములుగా కూడా ఇవ్వద్దు. దీనివల్ల గొడవలు పెరుగుతాయి. నిజంగా అలా జరుగుతరుందో? లేదో? అని ప్రయత్నించకూడదు కూడా.
  • ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా దేవుళ్ల చిత్రపటాలను, విగ్రహాలను గిఫ్ట్‌గా ఇవ్వద్దు, తీసుకోకూడదు. సాధారణంగా మీకు దేవుడి విగ్రహ ం గిఫ్ట్‌ వచ్చిందంటే దాన్ని ఎలా పూజించాలో, ఎక్కడ పెట్టాలో తెలియకపోవచ్చు. సరిగా పూజలు నిర్వహించకపోతే లాభాలు కాదు, ఇద్దరికీ నష్టాలు వస్తాయి. అందుకే ఎవరికైనా బహుమతులు ఇస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇవ్వాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version