సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇతరులకు తోడుగా ఉండాలి అని చాలా శాతం మంది భావిస్తారు. కాకపోతే కొంతమంది మాత్రమే వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించగలరు. ముఖ్యంగా ఎప్పుడైతే అప్పు ఇస్తారో ఎటువంటి ఇబ్బంది ఉండదు మరియు దానిని తిరిగి తీసుకునే సమయానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిరిగి మీ ధనాన్ని పొందడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులను అప్పుగా ఇస్తుంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
కొంతకాలం తర్వాత అప్పు తిరిగి చెల్లిస్తే ఎటువంటి ఇబ్బంది రాదూ కానీ కొంతమంది మాత్రం అప్పు ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించరు. ఇటువంటి సమయంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది. కనుక ఇటువంటి వారికి అస్సలు డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు. ముఖ్యంగా ఎవరైతే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారో వారికి డబ్బుని సరిగా వినియోగించడం రాదు అని గుర్తుంచుకోవాలి మరియు ఎవరికైతే బాధ్యత ఉండదో వారు డబ్బుని వృధా చేసుకుంటారు. అటువంటి వారికి డబ్బుని అప్పుగా అస్సలు ఇవ్వవద్దు. కొంతమంది పూర్తిగా పరిచయం లేకపోయినా ఎవరో తెలియకపోయినా సరే అప్పును అడుగుతూ ఉంటారు.
అలాంటి పరిస్థితుల్లో డబ్బును మాత్రం అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే అలాంటి వారికి డబ్బులను ఇవ్వడం వలన తిరిగి ఆ డబ్బుని మీరు పొందలేరు. పైగా మీ కష్టం అంతా వృధా అవుతుంది. కొంత శాతం మంది ఎన్నో తప్పులను చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో వారికి డబ్బులు ఇచ్చినా సరే ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే అనవసరమైన ఖర్చులు చేసి ఆ డబ్బుని వృధా చేస్తారు. ఎవరైతే మత్తు పదార్థాలు వంటి వాటికీ బానిసలై ఉంటారో అటువంటి వారికి డబ్బును అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారికి ఇచ్చిన డబ్బు అసలు వెనక్కి రాదు మరియు వారికి డబ్బు విలువ కూడా తెలీదు. కనుక అప్పు ఇవ్వకపోవడం మేలు.