మన దేశంలో కొన్ని ప్రాంతాలలో పాములను దైవంగా భావించి పూజిస్తారు.. మరి కొన్ని రాష్ట్రాలలో తింటారు..అయితే పాములు విష సర్పాలు.. ప్రతి సంవత్సరం ఎంతో మంది పాము కాటు ద్వారా చనిపోతున్నారు.పాములు ఎన్నో రకాలు ఉంటాయి..చెన్నై లోని స్నేక్ పార్కు లో 3 వేల జాతుల పాములు ఉన్నాయి..వాటిలో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి.అవి కరిస్తే మనిషి వెంటనే చనిపోతాడు.
పాములకు ముసలితనం వచ్చినప్పుడు వాటి గడ్డం రావడం ప్రారంభమవుతుందని చాలా మంది చెబుతారు. ఇందులో కూడా నిజంలేదు. కేవలం పుకారు మాత్రమే. పాములు సరీసృపాలు. వాటి శరీరంపై ఎలాంటి వెంట్రుకలు ఉండవు. అందువల్ల పాములకు గడ్డం వచ్చే ప్రసక్తే లేదు..
పాములను కొడితే అవి పగ పడతాయని అంటారు.. అసలు వాటికి అంత జ్ఞాపకశక్తి లేదని అంటున్నారు.. నాగస్వరం ఊదుతున్న వ్యక్తి. అటూ ఇటూ కదలినప్పుడు.. పాములు దానిని తమ ఆహారం లేదా ముప్పుగా భావిస్తాయి. పట్టుకోవడానికి అనుకరిస్తాయి. పాములకు మనుషుల్లా చెవులు ఉండవు. కానీ కొన్ని అవయవాల ద్వారా శబ్ధాలను వినగలవు. పాములు తమ తలను నేలపై ఆన్చినప్పుడు.. కంపనాలను సులభంగా గుర్తించగలవు..అందుకే వాటికి అపాయం ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి..ఇది పాముల అసలు రహస్యాలు..