మీ పిల్లలు అబద్దం చెబుతున్నారని సందేహమా..? అయితే ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!

-

మనకి ఒక్కొక్కసారి పిల్లలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది తెలియదు. నిజానికి తల్లిదండ్రులు అది నిజమో అబద్దమో కనిపెట్టడం కష్టమవుతుంది. మీరు కూడా ఇదే బాధతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ టిప్స్ ని అనుసరించాల్సిందే. ఈ టెక్నిక్స్ ద్వారా మీరు ఈజీగా పిల్లలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కనిపెట్టేయొచ్చు.

కళ్ళల్లోకి చూడకపోవడం:

కళ్ళల్లోకి చూడకుండా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారని మీరు సులభంగా గమనించొచ్చు. కాబట్టి ఈసారి వాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. మీకు తెలిసిపోతుంది.

వేరే టాపిక్ లోకి వెళ్లిపోవడం:

మీరు మాట్లాడే టాపిక్ కాకుండా వాళ్లు మరొక టాపిక్ గురించి మాట్లాడుతున్నట్లయితే కచ్చితంగా వాళ్ళు అబద్ధం చెపుతున్నారని మీరు తెలుసుకోవచ్చు.

ఆన్సర్ ని స్కిప్ చేయడం:

మీరు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా వేరే ఆన్సర్ చెబుతున్నట్లయితే కూడా మీ పిల్లలు అబద్దం చెబుతున్నారని మీరు గ్రహించొచ్చు.

ఎక్కువ మాట్లాడడం:

అడిగినది కాకుండా ఏవేవో జవాబులు చెప్తుంటే కూడా మీరు వాళ్ళు అబద్ధం చెపుతున్నారని గ్రహించొచ్చు.

సంబంధం లేని విషయాలు:

మీరు అడిగినది కాకుండా సంబంధం లేని విషయాలని వాళ్ళు మాట్లాడుతున్నట్లయితే కూడా వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని మీరు తెలుసుకోవచ్చు.

బాడీ లాంగ్వేజ్ లో మార్పులు రావడం:

బాడీ లాంగ్వేజ్ లో మార్పు వస్తే కూడా మీరు ఈజీగా వాళ్ళు చెప్పేది నిజం కాదని అబద్ధమని తెలుసుకోవచ్చు.

కోపం:

మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్లు కోపంగా ఉన్నట్లయితే కూడా అబద్ధమని తెలుసుకోవచ్చు. భయం, కోపం, బాధ వారిలో కనబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version