ఏపీలోని పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జాగర్లమూడి విలేజ్ హెల్త్ క్లినిక్ నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ వైద్యాధికారిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీ హర్ష వేధింపుల కారణంగా ఎలుకల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమె కొన్ని నెలల క్రితం మెటర్నిటీ లీవ్ తర్వాత విధులకు హాజరైనప్పటి నుంచి వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయని.. పూర్తి చేయకపోతే ఉద్యోగం మానేయాలని వైద్యాధికారి శ్రీ హర్ష రకరకాల మాటలతో వేదిస్తున్నారని ఆమె తెలిపారు.
కొంత కాలం తర్వాత ఆమె ఉద్యోగాన్ని రీజినల్ డైరెక్టర్ కి సరెండర్ చేయటంతో రీజనల్ డైరెక్టర్ కార్యాలయంకు వెళ్ళగా, రీజినల్ డైరెక్టర్ వెనకకు వెళ్లి అదే స్థానంలో పని చేసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు కూడా అదే చెప్పారని తిరిగి జాగర్లమూడికి వెళ్లి విధులకు హాజరవుతున్నప్పటికీ, FRS అటెండెన్సు వేస్తున్నపటికి, మెడికల్ ఆఫీసర్ శ్రీ హర్ష ఉద్దేశపూర్వకంగా 3 నెలలుగా శాలరీ బిల్ పెట్టలేదని, జీతం రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా శ్రీ హర్ష చెప్పుకోలేని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. దళిత మహిళా ఉద్యోగిని అని కూడా లేకుండా మీటింగ్స్లో అందరి ముందు అవమానకరంగా దూషిస్తూ మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు.