ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి “సరైనోడు-2” సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న అఖండ-2 సినిమా హిట్ అయితే వెంటనే బన్నీ, బోయపాటి కాంబినేషన్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ వార్త తెలిసిన అనంతరం అల్లు అర్జున్ అభిమానులు సంతోషపడుతున్నారు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని కోరుతున్నారు. మరి సరైనోడు-2 సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లయితే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మంచి సక్సెస్ అందుకుంటుందని అంటున్నారు.