గడప మీద కూర్చోద్దని పెద్దలు అంటారు కదా.. ఎందుకో తెలుసా..?

-

మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గడప మీద కూర్చోవడం మంచిది కాదని. అయితే ఎప్పుడైనా వాళ్లు ఎందుకు గడప మీద కూర్చోవద్దని చెబుతున్నారు అని ఆలోచించారా..? అయినప్పటికీ మీకు సమాధానం దొరకలేదా..? అయితే ఎందుకు అలా అంటారు అన్న దానికి గల కారణం ఇక్కడ ఉంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దాని గురించి చేయండి.

మన ఇంట్లో ప్రతి ఒక్క గదికి కూడా గడప ఉంటుంది. ఆ గడప మీద కూర్చోవడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ప్రధాన ద్వారం మీద ఉండే గడప మీద అసలు కూర్చోకూడదు. అయితే ఇలా ఈ ప్రదేశాలలో కూర్చోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా మనం అడ్డుకుంటున్నట్టు అవుతుంది అని పండితులు అంటున్నారు. అలానే మనం గడపని పూజిస్తూ ఉంటాము. పసుపు కుంకుమ రాసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాము.

అలానే గృహ ప్రవేశం సమయంలో కూడా ధాన్యం, పసుపు, కుంకుమ వంటివి వేసి లోపలికి ప్రవేశిస్తాము. అంత భక్తిగా కొలిచే గడప మీద కూర్చోవడం వల్ల లక్ష్మీదేవిని రానివ్వకుండా అడ్డుకుంటున్నట్టు అవుతుంది. ఇక దీని వెనుక సైంటిఫిక్ రీజన్ చూస్తే…

కిటికీల నుండి గాలి వస్తుంది అలానే ద్వారాల నుంచి కూడా గాలి వస్తుంది. మనం కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే గాలిలో బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉంటాయి దీనితో అవి నేరుగా మనపైనే పడతాయి. అందుకే గడ్డపై కూర్చోవడం మంచిది కాదు. అందుకే పెద్దవాళ్ళు గడ్డపై కూర్చోవడం అరిష్టం అని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news