ఈరోజుల్లో ఫోన్ ని ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్ వల్ల రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. చాలా మంది నిద్రలేచిన వెంటనే ఫోన్ ని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు సమస్యలు కొన్ని కలుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మొట్టమొదట ఫోన్ ని పట్టుకుని లేచిన తర్వాత 15 నిమిషాల వరకు ఫోన్ ని విడిచిపెట్టరు. నిజానికి స్మార్ట్ ఫోన్ ని లేచిన వెంటనే చూస్తే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. నిద్ర లేవగానే వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అని అంటున్నారు. లేచిన వెంటనే ఫోన్ చూసుకోవడం వలన మన మనసుని ప్రభావితం చేస్తుంది మనం మన రోజుని ఎప్పుడు ప్రశాంతంగా మొదలుపెట్టాలి ఒకవేళ కనుక ఫోన్ ని చూస్తే అలా మొదలు పెట్టడం కుదరదు.
ఆందోళన ఒత్తిడి వంటివి కలుగుతూ ఉంటాయి లేచిన వెంటనే కొంచెం మెడిటేషన్ చేయడం ఆ తర్వాత మిగిలిన పనులు చేసుకోవడం వంటివి చేయండి అంతేకానీ లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటే అస్సలు మంచిది కాదు. ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో అది రోజువారి పనుల మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం వలన డిప్రెషన్ వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో మనం మునిగిపోయినప్పుడు మన మెదడు డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది.
స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడిపోతున్నాము పుస్తకాలు చదివే వాళ్ళకంటే ఫోన్ ని ఉపయోగించే వాళ్ళ ఆలోచనలు బద్ధకంగా ఉంటాయని స్టడీ ద్వారా తెలిసింది. ఉదయాన్నే లేచిన వెంటనే ఫోన్ ని పట్టుకోకుండా కాసేపు వ్యాయామం చేయడం లేదంటే ధ్యానం చేయడం ఒక గ్లాసు నీళ్లు తాగడం ఇలా మీరు మొదలు పెడితే కచ్చితంగా సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు రోజంతా హ్యాపీగా ఉండొచ్చు.