మనకి అప్పుడప్పుడూ ఏదైనా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మనకి సమస్య వచ్చింది కదా అని ఇతరులతో చెప్తే దాని వల్ల మనం మరింత నష్ట పోవాల్సి వస్తుంది. అయితే డబ్బు మనిషికి నిజమైన బలం అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మనం కనక సంపద నష్టపోయినా దాని గురించి ఎవరికీ చెప్పకూడదు.
ఒకవేళ కనుక ఈ విషయం ఇతరులకు తెలిస్తే మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. అలానే మీకు బాధగా అనిపించినప్పుడు కూడ ఎవరికీ చెప్పకండి. మీ చుట్టూ ఉన్న వారు మీ బాధలు తెలుసుకుని మీ ముందుకు వచ్చి ఓదార్పును ఈ వ్యక్తం చేస్తారు అదే విధంగా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు కూడా అలానే మీ భార్య ప్రవర్తన సరిగా లేకపోతే దాని గురించి కూడా మీరు ఇతరులతో చెప్పద్దు.
ఈ విషయాన్ని కూడా మీరు మనసులోనే పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తలెత్తుకుని తిరగడం కష్టమవుతుంది. అవమానానికి గురి అయినప్పుడు కూడా ఎవరికీ చెప్పద్దు. ఈ విషయాన్ని కూడా ఎవరికైనా చెబితే చిన్నచూపు చూస్తారని ఆచార్య చాణిక్యుడు చెప్పారు. కాబట్టి వీటిని రహస్యంగానే ఉంచుకోండి. లేదంటే ఆ సమస్య మరెంత పెరుగుతుంది.