మనిషి చనిపోయినప్పుడు ఆత్మ ఎంత సేపు భూమి పై ఉంటుంది..

-

మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎంతసేపు భూమి మీద ఉంటుందనేది కొన్ని కొన్ని మతాలు, నమ్మకాల ప్రకారం మారుతూ ఉంటుంది. కొంతమంది ఆత్మ వెంటనే శరీరాన్ని విడిచిపెడుతుందని, మరికొంతమంది కొన్ని రోజులు లేదా వారాలపాటు భూమిపైనే ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా హిందూమతంలో గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ఎన్ని రోజులు భూమి పై ఉందనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం..

గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ సాధారణంగా 13 రోజులపాటు ఈ భూమిపైనే ఉంటుందని, అందులోనూ చనిపోయిన వ్యక్తి తన ఇంట్లోనే 13 రోజులు ఉంటాడని గరుడ పురాణం చెబుతుంది. ఆ ఇంట్లో ఆత్మ తన కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని నమ్ముతారు. ఈ 13 రోజులు అంత్యక్రియలు శార్ధ కర్మలు, పిండ దానాలు ఇలాంటి ఆచారాలన్నీ జరిగే సమయంలో ఆత్మ భూమి పైనే ఉంటుంది.ఈ ఆచారాలు ఆత్మకు శాంతిని తదుపరి గమ్యానికి అంటే పితృలోకం లేదా, యమలోకానికి వెళ్ళాడానికి సహాయపడుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది.

Does the Soul Linger After Death? Here's What Beliefs Say

మొదటి పది రోజులు ఆత్మ శరీరం లేని స్థితిలో ఉంటుంది. ఈ కాలంలో పిండదానం ఆత్మకు తాత్కాలికంగా శరీరాన్ని అందిస్తుందని గరుడ పురాణం చెబుతుంది. 11వ రోజు జరిగే కార్యక్రమంతో ఆత్మ పితృలోకానికి చేరుతుంది. ఇక 13వ రోజు జరిగే శార్ధ కర్మలు ఆత్మను పూర్తిగా ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరం చేస్తాయి. తదుపరి గమ్యానికి ఆత్మను పంపిస్తాయని గరుడ పురాణం లో చెప్పబడింది.

హిందూ సంప్రదాయం ప్రకారం,వారి కర్మలు ఆత్మ యొక్క ప్రయాణాన్ని సులభం చేస్తాయి అని కొందరి నమ్మకం. ఇక గరుడ పురాణం ప్రకారం శార్ధ కర్మలు లేనట్టయితే ఆత్మ భౌతిక ప్రపంచంలోనే చిక్కుకొని ప్రేతాత్మగా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది అనేస్పెక్టెడ్ గా చనిపోవడం, అంటే ప్రమాదవశాత్తు జరిగే ఆక్సిడెంట్, కావాలని ఆత్మహత్యలు చేసుకున్న వారు ఇక్కడే ప్రేతాత్మ గా మారతారని, ఆత్మకు ఉండే కోరికల వల్ల ఇక్కడే ఉంటారనేది కొంతమంది విశ్వసిస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు..)

Read more RELATED
Recommended to you

Latest news