వైరల్‌ వీడియో : పిల్లల కోసం నాగుపాముతో పోరాడిన‌ శున‌కం.. ఆ త‌ర్వాత‌

-

మనిషైనా.. జంతువైనా అమ్మ ప్రేమ ఒక్కటే. బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే త‌న బిడ్డ‌లపై నాగుపాముతో పోరాడి త‌ల్లిప్రేమ‌ను చాటుకుంది ఓ శున‌కం. ఈ క్ర‌మంలోనే పామును ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అందరినీ కదిలిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో జరిగింది. స‌మీపంలో ఓ వీధిలో ఉన్న షెడ్డులోకి పాము చొరబడింది. ఆ షెడ్డులో రెండు రోజు క్రితమే ఓ శునకం మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

అయితే పాము కాటుకు రెండు పిల్లలు చనిపోయాయి. మరోదానిపైకి బుసలు కొడుతూ.. కాటేయడానికి సిద్ధంగా ఉంది పాము. అంతలో అక్కడికి చేరుకున్న ఆ తల్లి కుక్క పామును అడ్డుకోవడానికి ప్రయత్నించింది. గట్టిగా అరుస్తూ.. దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేసింది. కుక్క అరుపులతో పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం కెమేరాలో చిక్కిన ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. తల్లి కుక్క మాతృప్రేమకు నెటిజన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version