కుక్కను కాపాలాకాసే ఉద్యోగం.. జీతం ఏడాదికి రూ. కోటి

-

టైటిల్‌ చూసి షాకై ఉంటారేమో కదా..! ఈ మధ్య కొన్ని వింత జాబ్‌లు తెగ వైరల్‌ అవుతున్నాయి.. పక్షలను తోలితే నెలకు లక్ష రూపాయిలు ఇచ్చే ఉద్యోగం మొన్నామధ్య తెగ ట్రెండ్‌ అయింది. ఇప్పుడు కుక్కను చూసుకునే జాబ్‌..హైలెట్‌ ఏంటంటే ఈ జాబ్‌కు శాలరీ కోటి రూపాయిలు ఇంకా ఎన్నో ఆఫర్స్‌ కూడా. ఆ కుక్కకు అంత డిమాండ్‌ ఎందుకో..? ఇంతకీ ఈ జాబ్‌ ఇచ్చే మహానుభావులు ఎవరబ్బా..!

ఒక బిలియనీర్‌ ఈ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు 2 కుక్కలు ఉన్నాయి. ఈ ఉద్యోగంలో చేరే వారు రోజంతా కుక్కలను చూసుకోవాలి. ఇందుకోసం సంవత్సరానికి కోటి రూపాయల శాలరీ ఆఫర్ ప్రకటించారు. ఈ ఉద్యోగంలో చేరిన వారికి ప్రతి సంవత్సరం 6 వారాల సెలవులు అంటే 42 రోజులు సెలవులు అందుబాటులో ఉంటాయి. కుక్కలతో కలిసి లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. మంచి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఈ ఉద్యోగం చేసేవారు ఉన్నత స్థానాల్లో నివసిస్తారట. అవసరమైనప్పుడు సంపన్నులతో మాట్లాడాల్సి ఉంటుంది.

ఏం చేయాల్సి ఉంటుందంటే..

ఉద్యోగంలో భాగంగా కుక్కలకు ఆహారం పెట్టాలి. వాటిని టైముకి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. కుక్కల అవసరాలన్నీ తీర్చాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కుక్కల గురించి తెలిసి వుండాలి. కుక్కలు తినే ఆహారం, పానీయాలపై అవగాహన ఉండాలి. కుక్కలతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. అభ్యర్థి తన వ్యక్తిగత జీవితం కంటే కుక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ఉద్యోగంలో చేరాలి అనుకునేవారు తాము ఇప్పుడు ఉన్నచోట అన్నింటినీ విడిచిపెట్టి ఒకే ఒక్క కాల్‌తో ఇంగ్లాండ్‌ వెళ్లాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగం ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ఉంది. జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్, కెన్సింగ్టన్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఈ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చింది.

ఉద్యోగానికి శాలరీ గట్టిగానే ఉంది కానీ.. పర్సనల్‌ లైఫ్‌ అంతా త్యాగం చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.!

Read more RELATED
Recommended to you

Latest news