హాస్పిటల్ కు వెళ్లి వైద్యం చేయించుకున్న కుక్క.. ఎమోషనల్ వీడియో

-

ఆ కుక్క అక్కడే కాసేపు సేద తీరింది. తర్వాత తేరుకున్న కుక్క.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కుక్క వీధి కుక్క. ఎవ్వరూ పట్టించుకోని కుక్క. కానీ.. బానూ సెన్ గిజ్ కు కుక్కలంటే ప్రాణం.

కుక్క ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటే ఎలా ఉంటది చెప్పండి.. కుక్కకు ఆసుపత్రి కూడా తెలుస్తుందా? అయినా అదేమన్నా మనిషా.. వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోనికి.. అంటారా? మీరు నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజం అది.

ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్ లో చోటు చేసుకున్నది. బానూ సెన్ గిజ్.. స్వతహాగా ఆమె జంతు ప్రేమికురాలు. తనకు ఓ ఫార్మసీ ఉంది. అక్కడ తన పని తాను చేసుకుంటోంది. ఇంతలో ఆమె తన ఫార్మసీలోకి దీనంగా వస్తున్న ఓ కుక్కను గమనించింది. దాని దగ్గరికి వెళ్లి చూసింది. అది తనవైపే వచ్చింది. తనకు ఏం అర్థం కాలేదు. తన దగ్గరికి వచ్చి కాలును ఎత్తి చూపించింది కుక్క. దాని కాలికి గాయమై రక్తం కారుతోంది. తన కాలికి అయిన గాయాన్ని గమనించిన బానూ వెంటనే దానికి ట్రీట్ మెంట్ చేసి కట్టు కట్టింది.

తర్వాత ఆ కుక్క అక్కడే కాసేపు సేద తీరింది. తర్వాత తేరుకున్న కుక్క.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కుక్క వీధి కుక్క. ఎవ్వరూ పట్టించుకోని కుక్క. కానీ.. బానూ సెన్ గిజ్ కు కుక్కలంటే ప్రాణం. వాటికి అప్పుడప్పుడు సేవలు చేస్తుంటుంది. బహుశా.. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ కుక్క ఆమె దగ్గరికి వెళ్లి ఉంటుంది. ఇక.. కుక్క డాక్టర్ తో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న వీడియో, ఫార్మసీ లోపలికి కుక్క వచ్చి తనకు గాయమైన కాలిని చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version