ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందట..!

-

అరేంజ్ మ్యారెజ్ చేసుకున్న కొత్త దంపతులు త్వరగా కలిసిపోవటానికి చాలా టైం పడుతుంది. లవ్ మ్యారేజ్ అయితే..అప్పటికే వాళ్లిద్దరి మధ్య బంధం ఉంటుంది కాబట్టి వీళ్ల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కానీ పెద్దలు చూసిన సంబంధం, ఆ వ్యక్తితో అదే తొలిపరిచయం..త్వరగా మూవ్ అవ్వలేరు. మొఖమాటం అడ్డొస్తుంది. అలాంటి వారికి ఈ టిప్స్ కాస్త ఉపయోగపడొచ్చు..అవేంటంటే..

 

 

ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకోవడానికి కలిసి గడపడమే కీలకమంటున్నారు ఆరోగ్యనిపుణలు. అందుకే రోజంతా సమయం కేటాయించలేకపోయినా.. ఉదయాన్నే కొన్ని పనులతో ఒకరికొకరు మరింత దగ్గర కావచ్చంటున్నారు.

రాత్రుళ్లు నిద్రపోవడానికి పడకగదిలోకి వెళ్లేముందు.. దంపతులు ఎవరికి వారుగా కాకుండా కలిసి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం మరింతగా బలపడుతుందంటున్నారు నిపుణులు. ఈ నియమం ఉదయం లేచే విషయంలోనూ వర్తిస్తుంది. ఒకేసారి నిద్ర లేవడం వల్ల ఓ ముద్దు-ఓ హగ్గుతో శుభోదయం చెప్పుకోవడం, ఆ తర్వాత చేయాల్సిన పనుల్ని పంచుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం.. ఇలా కలిసి గడపడానికి బోలెడంత సమయం దొరకుతుందట. పైగా మనసూ ఉత్తేజితమవుతుంది.

నిద్ర లేవగానే హడావిడిగా ఎవరి పనుల్లోకి వాళ్లు స్టాట్ చేయకుండా..ఓ ఐదు పది నిమిషాల పాటు ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దాంపత్యంలో అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ కలిసి కాసేపు జోక్స్‌ వేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల ఆ జోష్‌ రోజంతా మనతోనే ఉంటుంది.

ఒకవేళ వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. ఆలుమగలిద్దరూ కలిసి చేసే వ్యాయామాలూ వారి మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి కొన్ని నిమిషాల పాటు సరదాగా మాట్లాడుతూ వర్కవుట్‌ చేయడం వల్ల అందులో అలసట తెలియకపోగా.. ఏదో తెలియని మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు.

మీ భాగస్వామి మీకోసం పెట్టిన కాఫీ బాగున్నా, అల్పాహారం రుచిగా ఉన్నా లేదంటే తను వేసుకున్న డ్రస్‌ బాగున్నా.. ఇలా ఏ విషయంలోనైనా ఓ కాంప్లిమెంట్‌ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి పొగడ్తలు ఇద్దరినీ దగ్గర చేయడమే కాదు.. సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. అలా అని అదేపనిగా చెప్పొద్దు. వారికి మీరు బిస్కెట్ వేస్తున్నారని అర్థమయిపోతుంది.

ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ ఇద్దరి మధ్య త్వరగా సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ప్రేమను వ్యక్త పరచటానికి మరింత దగ్గరవ్వాలి..అలా అవాలంటే.. శృంగారం పాత్ర కీలకం! అది కూడా ఉదయం పూట ఈ పని చేయడం వల్ల మనసు ఉత్తేజితమవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇతర పనులపైనా ఏకాగ్రత పెట్టగలుగుతాం. అయితే అన్నివేళలా సాధ్యం అయ్యే పనికాదనకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version