కొంపముంచుతున్న డేటింగ్‌ యాప్స్‌.. తాజా సర్వేలో బయటపడిన షాకింగ్‌ విషయాలు..!!

-

పాశ్చత్యకల్చర్‌లో భాగంగా.. డేటింగ్‌ యాప్స్‌ అనేవి ఈరోజుల్లో చాలా కామన్‌ అయిపోయాయి..అయితే ఇందులో కొన్ని మంచివి ఉంటే.. మరికొన్ని కొంపలు ముంచేవి ఉంటున్నాయి. ఈ మధ్యనే హనీ ట్రాపింగ్‌ గురించి చూస్తున్నాం.. లైఫ్ పార్ట్‌నర్ కోసం వెతకడం వెతుకుతున్నారా అయితే ఈ లింక్ ను క్లిక్ చేయండి. అందమైన అమ్మాయిలు క్షణాల్లో మీకు అందుబాటులోకి వస్తారు అంటూ ప్రకటనలు పంపిస్తూ.. అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.. ఇలాంటి గ్యాంగ్‌లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యువకులను, జాబ్ చేస్తున్న మగవారినే టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముుఠాలు రెచ్చిపోతున్నాయి.
ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో నిలువునా దోచేస్తారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి, రూ. 2000 చెల్లిస్తే చాలు అమ్మాయి మీ ఇంటికి వస్తుందంటూ ప్రచారం చేస్తారు. విషయం తెలియని చాలా మంది కుర్రాళ్లు ఇలాంటి ప్రకటనలను నమ్మి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. టిండర్‌ అనే డేటింగ్‌ యాప్‌ ద్వారా కిడ్నాప్‌లకు గురి అవుతున్నారని వీరిలో ముఖ్యంగా బాధితులుగా పురుషులే ఉన్నట్లు తెలుస్తోంది.

టిండర్‌లో మోసపోయేది వీళ్లే..

అయితే కేవలం ఒంటరిగా ఉండే అంకుల్స్‌ను, యువకులను మాత్రమే టార్గెట్‌ చేస్తారంటా సైబర్‌ కేటుగాళ్లు. 40 ఏళ్లు పైబడి, కాస్త ఆస్తిపాస్తులు ఉన్న ఒంటరి పురుషులు బాధితులు అవుతున్నారు. చాలామంది నేరగాళ్లు, టిండర్ యాప్‌లో ప్రలోభపెట్టే మెసేజ్‌లు చేయడం ద్వారా, వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడటం ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందమైన అమ్మాయిల ఫోటోలు ఉంచి, ముందుగానే టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న వ్యక్తికి ఫేక్‌ అమ్మాయి ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతారు ఈ నేరగాళ్లు. ఆ తర్వాతి లేదా రెండు మూడు రోజుల తర్వాత బాధితులను సాయంత్రం సమయంలో, ఓ మారుమూల ప్రాంతాల్లో పర్సనల్‌గా కలుద్దామంటూ కేటుగాళ్లు కోరుతారు. ఈ విషయాలన్నింటిని చాటింగ్‌ రూపంలో లేదా వాయిస్‌ చేంజర్‌ యాప్‌తో అబ్బాయి వాయిస్‌ను అమ్మాయి వాయిస్‌గా మార్చి బాధితుడికి కాల్స్‌ చేస్తారు.
యాప్‌లో పరిచయమైన రెండు, మూడు రోజుల తర్వాత ఇలాంటి సమావేశాలు జరుగుతాయని కొంత మంది బాధితులు తెలిపారు. ఇలా చెప్పిన ప్రాంతానికి వెళ్లిన బాధితుడు లేదా బాధితురాలను కిడ్నాప్‌లు చేసి మరీ డబ్బులు తీసుకుని జంప్‌ అవుతారు.

మరోరకం మోసం..

ఇక మరోరకంగా కూడా దోపిడికి పాల్పడే అవకాశం ఉంది. ఎలా అంటే.. మరో కొద్ది గంటల్లో కలుస్తామన్న సమయంలో ఏదైన అర్జెంట్‌ వర్క్‌ ఉందని లేదా ఇంట్లో ప్రాబ్లమ్‌ ఉందన్న కారణంతో బాధితుడి నుంచి డబ్బులు లాగుతారు వీళ్లు… అలా కొంచెం కొంచెంగా మొదలై.. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, ఆ తర్వాత సిమ్‌ కార్డ్‌ను మార్చేస్తారు. అయితే భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో డేటింగ్‌ యాప్స్‌ ద్వారా మోసపోయి, కిడ్నాప్‌ అయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మోసాలు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, రాయ్‌పూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లోనే జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
టార్గెట్‌ చేసిన అబ్బాయిలను లైన్లో పెట్టి వాళ్లతో న్యూడ్‌ కాల్స్‌ మాట్లాడేలా చేసుకుని ఆ కాల్‌ రికార్డ్‌ చేసుకుని బాధితుడిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే.. నీ న్యూడ్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరిపంపులకు దిగుతారు. ఇక చేసేది ఏమి లేక ఆ బాధితుడు డబ్బులు ఇచ్చేస్తాడు. ఇలాంటి కేసులు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడం చాలా తక్కువ. ఎందుకంటే.. కేసు ఎంక్వైరీ పేరుతో ఎక్కడ తన విషయం మీడియాకు తెలుస్తుందోనని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందోనన్న భయంతో చాలామంది ఆగిపోతున్నారు..కాబట్టి తెలియని లింక్స్‌మీద క్లిక్‌ చేయొద్దు, తెలియని నెంబర్‌ నుంచి వీడియో కాల్స్‌ వస్తే అసలు అటెండ్‌ కావొద్దు.. ఒకవేళ అయినా మీ కెమెరాను కవర్‌ చేసుకున్నాకే అటెండ్‌ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలూ..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version