మీ జీవిత భాగస్వామి తో బంధం ఆరోగ్యకరంగా ఉందా? ఒక్కసారి చెక్ చేసుకోండి.

-

మీ భార్యతో మీకు నచ్చిన రెస్టారెంట్ కి వెళ్ళడమో, నచ్చిన ప్రదేశాలు చూడడమో, బైక్ మీద ఎక్కువ దూరాలు ప్రయాణం చేయడమో మీ మధ్య బంధం బాగుందని చెప్పవు. ఏ బంధమైనా మనసుకు సంబంధించినది. కేవలం మీ ఇద్దరి ఇష్టాలు ఒకటైనంత మాత్రాన మీ ఇద్దరి మధ్య బంధం బాగున్నట్టు కాదు. ఐతే మీ బంధం బాగుందని చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీలో కనిపించాలి. అవేంటో చూద్దాం.

మీ ఇష్టం వచ్చింది మాట్లాడే స్వేఛ్ఛ మీకున్నప్పుడు

మీ జీవిత భాగస్వామి మీకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఇంట్లో మీరిద్దరే ఉన్నప్పుడు వంటలో సాయం చేయకుండా ఉండడమో చేస్తుంటే, కనీసం ఈ హెల్ప్ కూడా చేయలేవా అని భయం లేకుండా అడిగారంటే మీ బంధం బాగున్నట్టే. చాలామంది రిలేషన్ షిప్ లో ఇలాంటి సాయాలు అడగడానికి ఇబ్బంది పడుతుంటారు.

నమ్మకం

సోషల్ మీడియా వచ్చిన అనేక బంధాల్లో చిచ్చులు మొదలయ్యాయి. అనుమానాలు లేకుండా మీతో పాటు కలిసి జీవిస్తున్నారంటే మీ బంధం బాగున్నట్టే. మీ మీద నమ్మకంతో ఫోన్ చేక్ చేయకుండా ఉండడం కూడా బంధం ఆరోగ్యకరంగా ఉన్నట్టే. ఆ నమ్మకం అవతలి వారిపై మీకు కూడా ఉండాలి.

ప్రేమ ప్రకటన

అవతలి వారి పట్ల మీ ప్రేమని తెలుపుతూ ఉండాలి. అది కూడా వాళ్ళకి నచ్చిన విధంగానే. అదేంటో మీకు తెలిసి ఉండాలి. బహుమతి ఇవ్వడం ద్వారానో, మాటల ద్వారానో ఎలా అయినా సరే అవతలి వారికి ఏది నచ్చుతుందో మీకు తెలిసి ఉండాలి.

పట్టూ విడుపు

ఏ విషయంలోనైనా పట్టూ విడుపులు ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సార్లు మీకు నచ్చిన విషయాన్ని పట్టుబట్టినట్టుగా చెప్పాలి. మరికొన్ని సార్లు మీకు అస్సలు ఇష్టంలేని విషయాల్లోనూ పట్టుదల వీడి పాలు పంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version