కోవిడ్‌తో లైంగిక సంబంధంపై ప్రభావం!

-

కోవిడ్‌ మహమ్మారి ప్రజలకు అనేక ప్రమాదాలను తీసుకువస్తూ ప్రజల సాధారణ జీవితాలపై దీని ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఇది సాధారణ లైంగిక సంబంధాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఐ్ఖఉ లోని మెడికల్‌ చీఫ్‌ డాక్టర్‌ కెల్లీ ఫారోల్‌ అన్నారు. కోవిడ్‌ సమయంలో మీ భాగస్వామి గురించి మీకు మరింత తెలుసు. సురక్షితమైన శృంగారాన్ని, భాగస్వామి తప్పకుండా తెలుసుకోవాలని సిఫార్సు చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా కోవిడ్‌ బారిన మీ భాగస్వామి పడితే సెక్సువల్‌ లైఫ్‌కు దూరంగా ఉండాలని, దీని వల్ల అధిక ప్రమాదం లేకుండ ఉంటుందని ఆమె తెలిపారు. సీడీసీ సిఫార్సు మేరకు కోవిడ్‌ 19 దృష్ట్యా మాస్క్‌ ధరించడం, దూరం పాటించడం వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గమని ఫారోల్‌ చెప్పారు. కానీ, సెక్సువల్‌ లైఫ్‌ వ్యక్తుల వ్యక్తిగత విషమని నేను నమ్ముతున్నానని అన్నారు.దీనివల్ల భాగస్వా ములిద్దరూ తెలిసి ప్రమాదం తెచ్చుకున్నట్లవుతుదని, ఇతర అంటువ్యాధుల మాదిరిగా భాగస్వాములిద్దరూ ఈ విషయంపై చర్చించుకుని ముందుకు వెళ్లడం సురక్షితం అన్నారు.


ఇల్లినాయిస్లోని సోఫోమోర్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ మేజర్‌ ఆండ్రూ సైమ¯Œ ్స మాట్లాడుతూ, డేటింగ్‌ యాప్‌ల ఉపయోగం వైవిధ్యంగా ఉందని, అయితే అతను వాటిని ఉపయోగించినప్పుడు సురక్షితంగా ఉండటానికి ప్రయత్నిస్తానన్నాడు.
‘నేను డేటింగ్‌ చేసే వ్యక్తి ఎవరో ధ్రువీకరించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను,‘ అని సిమన్స్‌
చెప్పారు. రెండో వ్యక్తి కంఫర్టబుల్‌ని తెలుసుకున్న తర్వాతే లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడతానని సిమన్స్‌ చెప్పాడు.
‘నేను ఎల్లప్పుడూ కారులో హ్యాండ్‌ శానిటైజర్‌ పెట్టుకుంటా , ఇతర పార్టీ ఒకదాన్ని కోరుకుంటే నేను సాధారణంగా నాతో మాస్క్‌లు ఉంచుకుంటాను. అప్పుడే వారితో కొద్దిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను‘ అని సిమన్స్‌ చెప్పారు. పరస్పర హస్త ప్రయోగం సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుందని, అలాగే మీ భాగస్వామితో కొత్తదాన్ని ప్రయత్నించండి అని సిమన్స్‌ అన్నారు.

‘కొన్ని విషయాలను ప్రయత్నించడానికి మరియు మసాలా చేయడానికి ఇది మంచి ప్రత్యామ్నాయం‘ అని సిమన్స్‌ చెప్పారు.
అతను వాటిని ఉపయోగించినప్పటికీ, విద్యార్థులు డేటింగ్‌ యాప్‌లను ఉపయోగించమని, వారికి తెలియని వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సిఫార్సు చేయనని సిమన్స్‌ అన్నారు.
‘ ప్రత్యేకించి మీరు ఇంతకు ముందు వారిని కలవకపోతే ఈ సమయంలో ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అని నేను భావిస్తున్నాను,‘వారితో సెక్సువల్‌ రిలేషన్‌ను పెట్టుకునే ముందు ఇతర పార్టీ వ్యక్తిత్వాన్ని లోతుగా తెలుసుకోండి.‘
శృంగారానికి వివిధ ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి కోవిడ్‌19 సమయంలో ముఖ్యంగా సహాయపడతాయి. ఇల్లినాయిస్లోని ఆల్టన్లోని అడాల్ట్‌ దుకాణాదారుడు సామ్, డెలిలా స్టోర్‌ మేనేజర్‌ నికోల్‌ కోడ్‌ మాట్లాడుతూ హస్త ప్రయోగం ఈ సమయంలో కచ్చితంగా సురక్షితంగా ఉండటానికి ఉత్తమ మార్గమన్నారు.
కొత్తవారిని కలిసి మహమ్మారి వ్యాప్తిని పెంచడం. వారితో కలవడం అనారోగ్యానికి గురికావడం కంటే ప్రస్తుతం సెక్స్‌ టాయ్‌ల వాడకం సురక్షితమని కోడ్‌ చెప్పారు.

‘లైంగిక ఆరోగ్యం ముఖ్యం. ఇది మీ శారీరక, మానసిక సురక్షితంగా ఉంటుందని’అని కోడ్‌ చెప్పారు.
లైంగిక భద్రత దృష్ట్యా సామ్, డెలిలా వంటి కంపెనీలు బ్లూటూత్‌ ద్వారా నియంత్రించేగలిగే సెక్స్‌ బొమ్మల వంటి రిమోట్‌ ఆప్షన్ల ఆఫర్‌ను పెంచాయని చెప్పారు.

మీరు రిస్క్‌ తీసుకొని మీ లైంగిక భాగస్వామితో మాట్లాడే ముందు ఎప్పుడూ ఆలోచించాలని ఆమె సిఫార్సు చేస్తున్నట్లు ఫర్రోల్‌ చెప్పారు. ‘మీరు మాట్లాడేది గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను, అది ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మీ గురించి మాత్రమే కాదు. ఇది మీ అమ్మ లేదా నాన్న గురించి లేదా ఇంట్లో ఎవరు ఉన్నారో, మరియు మీరు ఇంటికి తీసుకువెళ్లేది మీరు నివసించే వ్యక్తులకు నిజంగా తీవ్రంగా ఉంటుంది, ’’అని ఫారోల్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version