జీవితంలో మోసపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి..!

-

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఇతరుల చేతిలో మోసపోవాల్సి వస్తుంది కూడా. అయితే మనం మోసపోకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ పుస్తకంలో వివరించారు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తూ చాణక్య నీతి రచించారు ఆచార్య చాణక్యుడు.

అయితే మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలలో మోసపోకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ప్రస్తావించారు. సాధారణంగా మనం మన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకోవాలి. అదే విధంగానే దుర్మార్గులు సమాజంలో లేకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క లోపాలని అందరు ముందర ఎత్తిచూపారు. అప్పుడే వాళ్లు ఇలాంటి వాటిని తిరిగి చేయడానికి ధైర్యం చేయరు.

అలానే సిగ్గు, గౌరవం లేని వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండటం మంచిదని చాణక్య చెప్పారు. అలాగే మనం ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అవి సక్సెస్ అయ్యే అంత వరకు ఓపికగా ఉండాలి. మనల్ని అవమానించే వ్యక్తులకు దూరంగా ఉండాలి.

లోపల మనకి భయం ఉన్నా సరే బయటికి మాత్రం బలంగా కనపడాలి. అదే విధంగా ఎదుట వాళ్లకి మన వీక్నెస్ ఎప్పుడూ కనపడకూడదు అని అంటున్నారు. ఇలా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము ఎప్పుడు మోసపోకుండా విజయం సాధించ గలుగుతాము.

Read more RELATED
Recommended to you

Latest news