టికెట్ల వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో మంచు మోహన్బాబు బహిరంగ లేఖ రాశారు. చిత్ర పరిశ్రమ ఎవరి గుత్తాధిపత్యం కాదని… లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు. సీఎం జగన్ దగ్గరికి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు, ఇద్దరు హీరోలు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదని… చిన్న నిర్మాతలు తీసుకొని సీఎం ల దగ్గరికి వెళ్ళాలని మోహన్ బాబు సూచించారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యలను.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మౌనం వహిస్తున్నారని నిప్పులు చెరిగారు మోహన్ బాబు. చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు ఆడాలని పేర్కొన్నారు. మన కష్టాలు చెప్పుకోవాలి…ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని.. మా అందరి దేవుళ్ళు నిర్మాతలని మోహన్ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు నిర్మాతలు ఏమయ్యారని నిలదీశారు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖులు ఏ పార్టీలోనైనా ఉండవచ్చని.. దానిలో ఎలాంటి తప్పులేదన్నారు. కానీ.. పరిశ్రమకు ఆపద వస్తే.. అందరూ ఒకటి కావాలని కోరారు.