ఓరినాయనో…ఊరేగింపుకు తీసుకెళ్లలేదని పెళ్లికొడుకుపై రూ. 50లక్షల దావా వేసిన స్నేహితులు..!

-

పెళ్లంటే.. ఆ హడావిడే వేరు.. వచ్చే వాళ్లు, పోయే వాళ్లు, తినే వాళ్లు, ఇంటి నిండా బంధువులు, మగపెళ్లివారి అలకలు, ఆడపెళ్లి వారి బుజ్జగింపులు, మటన్‌ ముక్క రాలేదని కూడా గొడవకుదిగే మందుబాబ్భైలు..అబ్బో ఆ కథ వేరులే…. అయితే పెళ్లికంటే ముందు భరాత్‌ ఉంటుంది. పిచ్చిపిచ్చగా డ్యాన్స్‌ చేస్తారు. అక్కడ పెళ్లికొడుకు స్నేహితులేద హవా. కానీ ఇక్కడ… పెళ్లి ఊరేగింపుకు తీసుకెళ్లకుండా వరుడు వెళ్లిపోయాడని అతడి స్నేహితులు ఏకంగా రూ. 50లక్షల దావా వేశారు. మీరు విన్నది నిజమే..! అసలు ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇలా చేస్తారా అనిపిస్తుంది కదూ..! ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హరిద్వార్‌లోని బహదురాబాద్ ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడికి పెళ్లి కుదిరింది. అయితే, రవి బిజీగా ఉండటం వల్ల పెళ్లి శుభలేఖలను పంచేందుకు చంద్రశేఖర్ అనే ఫ్రెండ్‌ సాయాన్ని కోరాడు. దీంతో చంద్రశేఖర్ వరుడికి బదులుగా స్నేహితులందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచిపెట్టాడు. శుభలేఖలో పెళ్లి ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు అని ఉంది. చంద్రశేఖర్‌, మిగతా స్నేహితులంతా ఐదు గంటలకు వరుడు ఇంటికి చేరారు.
అప్పటికే వరుడు రవి స్నేహితుల కోసం ఎదురు చూడకుండా ఊరేగింపుతో వెళ్లిపోయాడట.. అంతే..అందరూ శుభలేఖలు పంచిన చంద్రశేఖర్‌ను నిందించడం మొదలుపెట్టారు.. కొందరు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మొదటి నుంచి రవి పెళ్లి పనులను చక్కబెడుతున్న చంద్రశేఖర్‌కు ఇది అస్సలు నచ్చలేదు. అతడు, మిగతా స్నేహితులతో ఓ లాయర్‌ను కలిశాడు. రవి పెళ్లికి హాజరైనవాళ్లంతా తనని మెంటల్‌ టార్చర్ చేశారని, రవి వల్ల తన పరువు పోయిందని చంద్రశేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రవిపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశాడు. మూడు రోజుల్లో వరుడు రవి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశాడు. అయితే, ఈ పిటీషన్‌ను కోర్టు విచారించిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. తెలిసిన నెటిజన్లు తలాఓమాట అంటున్నారు.. పాపం మనోడికి ఎంత కాలుంటే కోర్టు వరకు వెళ్లాడో అని ఒకరంటే.. అయినా పెళ్లికొడుకు వెళ్లిపోతే.. కార్డులు పంచినవాడిని ఎందుకండి నిందించడం అని మరొకరు అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version