పెళ్ళి చేసుకోబోయే ముందు అబ్బాయి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు..

-

పెళ్ళనేది రెండు జీవితాలని కలుపుతుంది. అప్పటివరకూ వివిధ గమ్యాలతో ప్రయాణిస్తున్న రెండు జీవితాలు ఒకే దిశలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే పెళ్ళి చేసుకోబోయే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరనుకున్న అమ్మాయి, అబ్బాయి దొరక్కపోవచ్చు. చాలా మంది పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళి తర్వాత మరోలా మారిపోవడానికి కారణం, వారనుకున్నట్లుగా జీవితభాగస్వామి దొరక్కపోవడమే. నిజం చెప్పాలంటే అలా దొరకాలని అనుకోకూడదు కూడా.

ఎందుకంటే అది మన చేతుల్లో లేదు కాబట్టి. ప్రేమ వివాహాల్లో ఇది కొంచెం సాధ్యమయ్యే పనే కానీ, చాలా ప్రేమలు పెళ్ళయ్యాక మారిపోతున్నాయి. కాబట్టి ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు పెళ్ళికి ముందు తెసులుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే,

పెళ్ళికి మీరు రెడీనా కాదా అన్నది తెలుసుకోవాలి. పెళ్ళితో మీ ఇద్దరు మాత్రమే ఒక్కటి కారు. మీ కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి. పెళ్ళి తర్వాత ఏ సమస్య వచ్చినా మీతో పాటు మీ కుటుంబం కూడా బాధపడాల్సి ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే మీరు పెళ్ళికి నిజంగా రెడీగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.

మీక్కాబోయే అమ్మాయి గురించి చాలా కలలు కని ఉంటారు. ఆ కలలన్నింటికీ వ్యతిరేకంగా ఉండే అమ్మాయి మీ భాగస్వామి కావచ్చు. అందుకే నో ఎక్స్ పెక్టేషన్. కామ్ గా ఉండండి. ఒకవేళ మీరనుకున్నట్లు అమ్మాయి దొరికితే సంతోషమేగా.

పెళ్ళయ్యాక మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోకూడదు. అది ఎంతమాత్రం మంచిది కాదు.

పెళ్ళి చేసుకున్నాక అవతలి వారి రంగు గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడడం చేయవద్దు. అది వారిని మరింత బలహీనపరుస్తుంది. ఒకవేళ వాళ్ళకి కోపం వస్తే మీరు తట్టుకోలేరని గుర్తించండి. హాస్యానికి కూడా అలాంటి పొరపాటు చేయవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version