ఇష్టమైన వ్యక్తులకు తమ మనసులోని మాట చెప్పేందుకు కొందరు వాలంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ప్రియుడు తన ప్రేయసి కోసం రింగు, గులాబీ పూలు, చాక్లెట్లు తీసుకుని ప్రపోజ్ చేస్తుంటారు. వీరి ఆలోచనల్నీ ప్రియురాలి చుట్టూనే తిరుగుతాయి. ఎలా ఇంప్రెస్ చేయాలని.. ఎలాంటి మంచి స్పాట్‌కి తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అయితే ఓ ప్రేమికుడు చేసిన తతంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఆమె తన జ్యూవెలరీ బాక్సులో ఉంగరం ఉందా.. లేదా అని చెక్ చేసుకుంది. బాక్స్ తెరిచి చూడగా అందులో డైమండ్ రింగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ డైమండ్ రింగ్ విలువ మార్కెట్‌లో 6,270 డాలర్లు ఉంటుందని (రూ.4,55,145) పోలీసులకు తెలిపింది. ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా ఆ అమ్మాయి ఓర్లాండోకు చెందినట్లు గుర్తించారు.
ఆ అమ్మాయిని సంప్రదించగా.. డైమండ్ రింగ్‌ను తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పింది. ఆరెంజ్ సిటీకి చెందిన యువతిని అతడి బాయ్‌ఫ్రెండ్ పేరు అడగగా.. జాయ్ బ్రౌన్ అని, ఓర్లాండ్ యువతిని అడగగా.. మార్కస్ బ్రౌన్ అని చెప్పింది. తీరా అతడి ఫోటోలు చూపించమని అడిగితే ఇద్దరిని ఒక్కడే మోసం చేశాడని గుర్తించారు. ఒకరికి తెలియకుండా ఇద్దరిని దగ్గరి నుంచి విలువైన వస్తువులు దొంగిలించాడని గ్రహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్త్ కరోలినాలో అతని బంధువులు ఉన్నారని గుర్తించారు. అతడి పేరు జోసెఫ్ డవీస్ అని, ఇప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.