గూగుల్ పే వాడేవాళ్ళకి గుడ్ న్యూస్..!

-

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఎంతో మంది ఫోన్ పే, గూగుల్ పే మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు. మీరు గూగుల్ పే వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గూగుల్ పే లో ఇప్పుడు కొత్త సేవలు రానునున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

How Google Pay Allows You To Make Purchases Without Your Credit Card

డిజిటల్ పేమెంట్స్‌ ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యం తో గూగుల్ కొత్త ఆప్షన్స్ ని తీసుకు రావడం జరిగింది. అయితే అవి ఏమిటి..?, వాటి వలన ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశ్యం తో గూగుల్ కొత్త ఆప్షన్‌ను హింగ్లీష్ పేరుతో అందుబాటు లోకి తెచ్చింది.

అదే విధంగా మరొక అదిరే ఫీచర్ ని ఒకటి తీసుకు రానుంది. అదే పే వియా వాయిస్ ఫీచర్. వాయిస్ కమాండ్స్ ద్వారా డబ్బులు పంపొచ్చు. మీరు చెబితే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

యూజర్లు అందరికీ ఈ ఫీచర్ అందుబాటు లోకి వస్తోంది. అలానే గూగుల్ వ్యాపారుల కోసం కూడా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. మైషాప్ పేరుతో ఈ సర్వీసులు వస్తున్నాయి. వ్యాపారులు ఇమేజ్ యాడ్ చేయడం, దాని వివరణ, ధరలు వంటి వాటిని నిమిషాల్లో యాడ్ చెయ్యచ్చు. ఆ లింక్‌ను సోషల్ మీడియా లో మరియు గూగుల్ ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news