అస్సాంలో భూకంపం… దేశంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూప్రకంపనలు..

-

వరస భూకంపాలు ప్రజలను కలవరానికి గురి చేస్తుంది. ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రతీ రోజు ఎక్కడో చోట భూకంపాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాల ఎక్కువగా వస్తున్నాయి. అయితే తక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తుండటంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు ఉండటం లేదు.

శనివారం రోజు దేశంలో రెండు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. తాజాగా అస్సాం రాష్ట్రంలో రాజధాని గౌహతి ప్రాంతానికి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. గౌహతికి నైరుతిలో 38 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.  అంతకుముందు శనివారం ఉదయం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రం జలోర్ లో భూకంపం వచ్చింది. జలోర్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news