భూ వివాదంలో చిక్కుకున్న మంత్రి తానేటి వనిత..!

-

ఏపీ మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు , శివానంద మఠంకు చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయానికి మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంఖుస్థాపనను బిజెపి, అర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకోబోయారు.

దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్థలం తమ వంశస్తులదని తనకు పూర్తి హక్కు ఉందని బండి రామ స్వామి అనే వ్యక్తి పత్రాలు చూపిస్తున్నారు. అతన్ని కూడా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….2014లో ఈ స్థలాన్ని మేడపాటి మురళి మోహన్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసా..30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారు ఎవరూ డాక్యుమెంట్స్ తో లేరు. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ… అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news