మిడతల ఎరువు.. లాభం పొందుతున్న కెన్యా రైతులు..!

-

మిడతలు.. గతేడాది ఇవి సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. పంటలపై దాడి చేసి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో మిడతల దండు అనేక మంది రైతుల పంటను నాశనం చేశాయి. ఇలాంటి ఘటనలు కెన్యా దేశంలోనూ తరుచూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ రైతులు ఎక్కడ పోగుట్టుకున్నామో అక్కడే వేతుక్కోవాలని అనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మిడతల కారణంగా నష్టపోయిన రైతులు తిరిగి వాటివల్లే లాభాలు పొందుతున్నారు.

Locusts

మిడతల్ని ఎరువుగా చేసి..
మిడతల్లో ప్రోటీన్లు, ఇనుము, జింక్‌, మెగ్నీషియమ్‌ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని జంతువులకు దాణాగా వేయొచ్చు. అలాగే సేంద్రియ ఎరువుగానూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై లారా స్టాన్‌ఫోర్డ్‌ అనే వ్యక్తి ‘ది బగ్‌ పిక్చర్‌’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ.. పంటలను నాశనం చేస్తున్న మిడతల్ని సేకరించి వాటిని పౌడర్‌గా మార్చి దాణా.. ఎరువుల రూపంలో విక్రయిస్తుంటుంది. మిడతలకు ఆహారపరంగా.. సంతానోత్పత్తికి కెన్యాలో అనువైన వాతావరణం ఉంటుంది. అక్కడి తుఫానులను మిడతల సమూహం ధీటుగా ఎదుర్కొనగలవు. అందుకే కెన్యాకు మిడతల గుంపు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా లైకిపీయా, ఇసియొలో, సంబూరి, సెంట్రల్‌ కెన్యా ప్రాంతాల్లో మిడతల సమస్య ఎక్కువగా ఉంటుంది.

బగ్‌ పిక్చర్‌ సంస్థ మిడతల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. తులు పంటలకు బదులు.. మిడతల్నే పెంచాలని కోరుతోంది. అలా రైతులు పెంచిన మిడతల్ని కిలో 50 కెన్యన్‌ షిల్లింగ్స్‌ చొప్పున బగ్‌ పిక్చర్‌ సంస్థే కొనుగోలు చేస్తోంది. వాటిని మిల్లుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న జంతువుల దాణా, ఎరువుగా మార్చితుంది. ఈ విధంగా మిడతల వల్ల పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడే మిడతలే పంటగా మార్చి ఆదాయం పొందేలా చేస్తున్నామని లారా స్టాన్‌ఫొర్డ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version